BigTV English

Ghaati: దేసి రాజు.. దిమ్మ తిరిగే యాక్షన్ తో అదరగొట్టేశాడు.. చివర్లో స్వీటీ లుక్ మాత్రం..

Ghaati: దేసి రాజు.. దిమ్మ తిరిగే యాక్షన్ తో అదరగొట్టేశాడు.. చివర్లో స్వీటీ లుక్ మాత్రం..

Ghaati: సైజ్ జీరో సినిమా తరువాత అనుష్క శెట్టి వరుస సినిమాలు చేయడం తగ్గించింది. బరువు పెరగడంతో.. దాన్ని తగ్గించడానికి కష్టపడింది. ఆ తరువాత అడపాదడపా ఒక్కో సినిమా చేస్తూ ప్రేక్షకుల కళ్ల నీళ్లు తుడుస్తోంది. ఇక ఆమె ఎప్పుడు వచ్చినాకూడా  మంచి హిట్ ను అందుకొనే వెళ్తుంది.  రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అభిమానులను అలరించిన  స్వీటీ .. ఈసారి ఘాటీ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది.


క్రిష్ జాగర్లమూడి  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్  సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోందని  పోస్టర్ తోనే తెలిపాడు క్రిష్. ఇక ఈ చిత్రం నుంచి రిలీజైన గ్లింప్స్  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మునుపెన్నడూ చూడని స్వీటీని ఇందులో క్రిష్ చూపించాడు.

అసలు ఆ గ్లింప్స్ లో అనుష్క.. కత్తి పట్టుకొని  విలన్ల తల తెగనరికి ఆ తలను పట్టుకొని ఆమె నడుస్తుంటే ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. ఆ ఒక్క వీడియో సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Manchu Manoj: వారి సమాధులకు దండం పెట్టుకోవడానికి వచ్చాను.. లోపలికి వెళ్లనివ్వండి

ఇక తాజాగా  సంక్రాంతి పండగ సందర్భంగా ఘాటీ నుంచి ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ను మేకర్స్ ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమాలో  ఒక కీలక పాత్రను పరిచయం చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రభు  ఈ సినిమాలో దేసి రాజు అనే పాత్రలో కనిపిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దేసి రాజు క్యారెక్టర్ ను తెలిపే గ్లింప్స్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దేసి రాజు అంతా యాక్షన్ తో అదరగొట్టాడు.

అటు విలేజ్ .. ఇటు పట్నం అని కాకుండా ఒక మోస్తారు యువకుడిగా విక్రమ్ ప్రభు కనిపించాడు. పోలీసుల దగ్గరనుంచి సరుకును కాపాడం, వారికి దొరకకుండా పారిపోవడం  లాంటి దృశ్యాలను ఇందులో చూపించారు. అంటే స్వీటీకి తోడుగా దేసి రాజు కూడా గంజాయిని సప్లై చేస్తాడని ఈ వీడియో బట్టి అర్ధమవుతుంది.

ఇక చివర్లో విక్రమ్ ప్రభుతో పాటు.. స్వీటీ కూడా బైక్ మీద వెనుక  సరుకు ఉన్న బ్యాగ్ లను పట్టుకొని బైక్ పై వెళ్తూ చిరునవ్వు చిందిస్తూ కనిపించింది. ఆ లాస్ట్ ఫ్రేమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా  ఏప్రిల్ 18 న  థియేటర్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో అనుష్క ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×