BigTV English

Moto G 2025 Series : కిర్రాక్ మెుబైల్స్ మార్కెట్లోకి దించిన మెటో

Moto G 2025 Series : కిర్రాక్ మెుబైల్స్ మార్కెట్లోకి దించిన మెటో

Moto G 2025 Series : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Motorola ఎట్టకేలకు Moto G 2025 సిరీస్‌ను ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. అవి Moto G 2025, Moto G పవర్ 2025. ఈ గ్యాడ్జెట్స్ ప్రస్తుతం అమెరికా, కెనడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నాయి.


Motorola తాజాగా తీసుకొచ్చిన Moto G 2025 సిరీస్‌ మెుబైల్స్ అదిరిపోయే ఫీచర్స్ తో అందుబాటు ధరలోనే ఉన్నాయి. ఈ సిరీస్ లో రెండు ఫోన్‌లు MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తున్నాయి. ప్రాసెసర్ తో పాటు ఈ రెండు మెుబైల్స్ లో ఫీచర్స్ చాలా వరకూ ఒకేలా ఉన్నాయి. Moto G 2025లో, Moto G పవర్‌తో పోలిస్తే థిక్ డిజైన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రెండు గ్యాడ్జెట్స్ డిజైన్స్ కూడా చాలా వరకూ వేరు వేరుగానే ఉన్నాయి.

మోటో గత ఏడాది Moto G 5G (2024), Moto G Power 5G (2024) ను తీసుకొచ్చింది. ఈ మెుబైల్స్ 2024 మార్చిలో లాంఛ్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీటికి లేటెస్ట్ వెర్షన్ లో Moto G 5G (2025), Moto G Power 5G (2025) ను తీసుకొచ్చేసింది.


ఈ రెండు మొబైల్స్ మార్కెట్లో అందుబాటు ధరలలోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఈకామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో ఈ మెుబైల్స్ అందుబాటులో ఉన్నాయి. Moto G 2025ను మే 5 నుంచి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇక మోటో G పవర్ 2025 ఫిబ్రవరి 6 నుంచి అందుబాటులో ఉండనుంది.

Moto G 2025 Series Features –

Moto G 2025 6.7-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చేసింది. ఇంకా Moto G పవర్ 2025 6.8 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ గ్యాడ్జెట్స్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో పని చేస్తాయి. ఇక డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో Moto G పవర్‌ డౌన్‌గ్రేడ్‌ అవ్వగా.. స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 SoCతో Moto G అప్‌గ్రేడ్ అయ్యింది.

ఇంకా, సిరీస్ నుండి పవర్ వేరియంట్ IP69 డస్ట్ అండ్ వాటర్ నిరోధకతను కూడా అందిస్తుంది. ఇక బేస్ వేరియంట్ IP52 రేటింగ్‌ను పొందుతుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా హలో యుఎక్స్ సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తాయి. బేస్ వేరియంట్ 4GB LPDDR4X RAMతో పాటు 64GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. మరోవైపు, పవర్ వేరియంట్ 8GB LPDDR4X ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది.

ఇక ఈ గ్యాడ్జెట్స్ ను మైక్రో SD కార్డ్ తో 1TB వరకు పెంచగలిగే ఛాన్స్ ఉంది. Moto G 2025 50MP ప్రైమరీ షూటర్, 2MP సెకండరీ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెన్సార్ల పరంగా రెండు ఫోన్‌ల మధ్య ఇక్కడ ఉన్న ఏకైక తేడా ఏమిటంటే పవర్ వేరియంట్ 8MP సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంది.

ALSO READ : ఈ రోజు ఇంటర్నెట్ బంద్.. ఎందుకో తెలుసా!

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×