Manchu Manoj: మంచు కుటుంబం మరోసారి రోడ్డెక్కింది. మొన్నటివరకు ఆస్తితగాదాల వలన మంచు అన్నదమ్ములు రోడ్డెక్కారు. మోహన్ బాబు ఇద్దరు బిడ్డలకు ఆస్తి సమానంగా ఇవ్వలేదని చిన్న కొడుకు మనోజ్ ఎదురుతిరిగాడు. తన అన్నయ్య మంచు విష్ణు తనను, తన కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు, మనోజ్ ఇంట్లో నుంచి గెంటేశాడు.మోహన్ బాబు – మనోజ్ మధ్య జరుగుతున్న యుద్ధం కొద్దిగా చెక్కబడింది.
మనోజ్ కూతురును మోహన్ బాబు తన ఇంట్లోనే పెట్టుకోవడంతో అతను గేటు బయట రచ్చ రచ్చ చేశాడు. తన కూతురును తనకు తిరిగి ఇవ్వాలని ఫైర్ అయ్యాడు. ఆ వివాదంలోనే మోహన్ బాబు జర్నలిస్ట్ పై మైక్ విసిరేసి పెద్ద పొరపాటు చేశాడు. ఆ పొరపాటు అరెస్ట్ వరకు వెళ్లింది. దీంతో కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న మోహన్ బాబు.. రెండు రోజుల క్రితం సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి బయటకు వచ్చాడు. అప్పుడు కూడా మోహన్ బాబు, విష్ణు కుటుంబం కలిసి ఒక దగ్గర పండగ చేసుకోగా.. మనోజ్ తన కుటుంబంతో కలిసి మరోదగ్గర పండగ జరుపుకున్నాడు.
ఇక్కడి వరకు బాగేనా ఉన్నా.. నేడు కనుమ పండగ కావడంతో.. పెద్దవారి సమాధులను సందర్శించి, ఆశీర్వాదాలు అందుకొనే సాంప్రదాయం ఉండడంతో.. దాని కోసం మనోజ్ కుటుంబం తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీకి వచ్చింది. ఇక మనోజ్ మళ్లీ గొడవ చేస్తాడేమో అనుకోని పోలీసులు ఆయనను లోపలికి రానివ్వలేదు. పెద్ద ఎత్తున పోలీసులు భద్రత ఏర్పాటు చేయడంతో పాటు.. శాంతిభద్రతల దృష్ట్యా మనోజ్ యూనివర్సిటీకి వచ్చేందుకు అనుమతి లేదని నోటీసులు కూడా పంపారు.
నెట్ ఫ్లిక్స్ లో ఈ ఏడాది రిలీజ్ అయ్యే తమిళ్ సినిమాలు ఇవే
ఇక తిరుపతి వచ్చిన మనోజ్.. హోటల్ లో బస చేసి.. యూనివర్సిటీకి చేరుకున్నాడు. పోలీసులు అతనిని లోపలి రానివ్వలేదు. ఇక ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. ” నేను గొడవ చేయడానికి రాలేదు. ఈరోజు పండగ. మా తాత, నాన్నమ్మ సమాధులు లోపల ఉన్నాయి. వారికి దండం పెట్టుకోవడానికి మాత్రమే వచ్చాను. అది కూడా చేయనివ్వరా.. ? ఎందుకు నేను లోపలకి వెళ్ళకూడదు. నేను పోలీసుల అందరితో మాట్లాడాను. వాళ్లు ఎందుకు ఆపుతున్నారో అర్ధం చేసుకున్నాను. మా తాత, నాన్నమ్మ సమాధులకు దండం పెట్టుకొని వెళ్లాలనే వచ్చాను. కానీ, ఇక్కడ వేరే బిహేవియర్ స్టార్ట్ అయ్యిపోయింది.
జనరేటర్ లో చక్కర పోయడం, ఇక్కడ నా హోర్టింగ్స్ ఉంటే తీసేయడం, ఎందుకంత లెవెల్.. నేను ఆయనకు తమ్ముడినే కదా. నేను తప్పు చేస్తే కూర్చోని మాట్లాడమని పెద్దలముందు చెప్పాలి. మాట్లాడడానికి లేదు. నాకు మొహం చూపించడానికి సిగ్గు పడతారో, భయపడతారో తెలియదు. హోర్టింగ్స్ ను చించగలుగుతారేమో కానీ, నన్ను, నాతో పాటు వచ్చిన మనుషులను ఏం చేయలేరు. ఇది నా వూరు.. వీరు నా బంధువులు. వీరిని బెదిరించడం చేయకండి. కోర్టు లో కేసు ఉంది.. అక్కడే లీగల్ గా తెలుసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా పోలీసుల దగ్గరకు వెళ్తాను. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతాను. ఇచ్చారా ఓకే.. ఇవ్వలేదు అంటే నా తరపున నేను కూడా కేసు పెట్టి వెళతాను” అని చెప్పుకొచ్చాడు.