E-Paper
Advertisement

Devara Collections: దేవర టార్గెట్ ఫినిష్.. సోలో హీరోగా భారీ రికార్డ్..!

Devara Collections: దేవర టార్గెట్ ఫినిష్.. సోలో హీరోగా భారీ రికార్డ్..!
Advertisement

Devara Collections.. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) తాజాగా నటించిన చిత్రం దేవర (Devara ). సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. అయితే మధ్యలో కలెక్షన్స్ కి కాస్త బ్రేక్ పడినా దసరా సెలవులను మాత్రం ఈ సినిమా మేకర్స్ బాగానే యూస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా ఏకంగా టార్గెట్ ఫినిష్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దసరా పూర్తయ్యే లోపే రూ.500 కోట్ల క్లబ్లో చేరిపోయింది దేవర. మొత్తానికి అయితే సెప్టెంబర్ 27వ తేదీన రూ.500 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా దసరా ముగిసే లోపే టార్గెట్ బ్రేక్ చేయడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసిన దేవర..

Advertisement

ఇకపోతే దేవర సినిమా విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ.405 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా 16 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇకపోతే చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుండగా . అభిమానులు కూడా ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇకపోతే దేవర విడుదలకు ముందే రూ. 500 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగగా.. ఇప్పుడు టార్గెట్ కాస్త ఫినిష్ అయిందని చెబుతున్నారు. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ రూ.180 కోట్లు జరిగింది. అంటే ఈ సినిమా రూ.400 కోట్లు వసూలు చేస్తే హిట్ అయినట్టే. ఇప్పుడు రూ 500 కోట్ల గ్రాస్ వసూల్ చేసి రికార్డు సృష్టించింది ఈ సినిమా. మొత్తానికైతే దేవర సినిమా సక్సెస్ పార్టీ కూడా చేసుకుంది. ఎన్టీఆర్ సోలో హీరోగా రూ. 500 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలపై కూడా అంచనాలు భారీగా నెలకొంటున్నాయి.

ఎన్టీఆర్ కెరియర్..

Advertisement

ఎన్టీఆర్ విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో ఆయన అన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే దేవర సినిమా చేశారు. ఇప్పుడు అతి తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసి, తన ఖాతాలో మంచి విజయాన్ని వేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఇందులో తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటన తో అంద చందాలతో అందరినీ మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు రామ్ చరణ్ మూవీలో కూడా అవకాశం లభించిన విషయం తెలిసిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×