E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today October 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు ప్రమాదం తెచ్చిన అంజు బర్తుడే – అంజుకు సర్ ప్రైజ్‌ ఇచ్చిన పిల్లలు

Nindu Noorella Saavasam Serial Today October 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు ప్రమాదం తెచ్చిన అంజు బర్తుడే – అంజుకు సర్ ప్రైజ్‌ ఇచ్చిన పిల్లలు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ను హగ్‌ మిస్సమ్మ అలాగే ఉండిపోతుంది. రాథోడ్‌ కూడా హ్యాపీగా ఫీలవుతుంటాడు. కరుణ కూడా నవ్వుతూ ఉంటుంది. ఆరు మాత్రం ఈర్శ్య పడుతుంది. కోపంగా రాథోడ్‌ ను కొడుతుంది. రాథోడ్‌ పక్కన ఎవ్వరూ లేరు కానీ కొడుతున్నారేంటి అని షాక్‌ అవుతాడు. ఇంతలో అక్కడికి గుప్త వచ్చి చూడకూడనివి చూస్తుంటే ఆలాగే ఉంటుంది. ఇక్కడి నుంచి పద వెళ్దాం అని ఆరును తీసుకుని వెళ్తాడు.

తర్వాత రాథోడ్‌ అయ్యో స్కూల్‌ నుంచి పిల్లలు వచ్చే టైం అయింది అని అమర్‌ దగ్గరకు వెళ్లి మిస్సమ్మకు పిల్లలు వచ్చ టైం అయింది అంటాడు. వెంటనే అమర్‌, మిస్సమ్మను దూరంగా తోస్తాడు. మిస్సమ్మ సిగ్గుపడుతుంది. కరుణ, మిస్సమ్మను చూస్తూ నవ్వుతుంది. అమర్‌ నాకు బయట పనుంది వెళ్లి వస్తాను అని వెళ్లిపోతాడు. మిస్సమ్మ సిగ్గుపడుతూ అమర్‌ వెనకాలే వెళ్లబోతుంటే కరుణ ఇంట్లోకి వెళ్లాలి బయటకు కాదు అంటుంది. దీంతో మిస్సమ్మ సిగ్గు పడుతూనే లోపలికి వెళ్లిపోతుంది.

Advertisement

ఘోర, ఆరు ఆత్మను బంధించేందుకు పూజలు చేస్తుంటాడు. తర్వాత ఇంటికి వచ్చిన మనోహరి కోపంగా ఆరును తిడుతుంది. ఎందుకే.. ఎందుకు చిన్నప్పటి నుంచి దేవుడు ఎప్పుడూ నీ వైపే ఉంటున్నాడు. ఇద్దరం అనాథలం ఇద్దరి తలరాత ఒకటే అవ్వాలి కదా? నీ సంతోషంలోంచి పుట్టిన స్వార్థం ఆరు ఇది. నీ సంతోషం పూర్తిగా నాశనం అయితే తప్ప నా స్వార్థం పోదు. శక్తులు వచ్చాయని ఆనంద పడుతున్నావు కదా? రేపటితో నీ ఆశల ఆవిరి చేస్తాను చూడు అంటూ కోపంగా లోపలికి వెళ్తుంది మనోహరి.

మనోహరికి ఎదురుగా వచ్చిన అంజు రేపు తన బర్తుడే ఉందని కేక్‌ కటింగ్‌ కూడా ఉంటుందని మీరు రేపు ఎక్కడకు వెళ్లొద్దని చెప్తుంది. దీంతో మనోహరి హ్యాపీగా సరే అంజు అని చెప్పి.. రేపు ఆరును బంధించేందుకు చక్కని అవకాశం. ఘోర ఇచ్చిన పౌడర్‌ ఆరు ఎలాగైనా ముట్టుకునేలా చేయాలి అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఆరు ఇక అందరికీ చెప్పాను రణవీర్‌ అంకుల్‌ ఒక్కరికి చెబితే సరి అంటుంది. వెంటనే మనోహరి ఆయనకు ఎందుకు అంజు ఆయన మన ఫ్యామిలీ మెంబర్ కాదుకదా అంటుంది. లేదు ఆంటీ ఆయన  మనకు ఫ్యామిలి మెంబరే అని డాడీ చెప్పారు కదా? అంటూ అంజు రణవీర్‌కు ఫోన్ చేస్తుంది.

Advertisement

అంజు మాట్లాడుతుండగానే రణవీర్‌ ఫోన్‌ ఒకసారి మనోహరి ఆంటీకి ఇవ్వమని చెప్తాడు. ఆంజు ఫోన్‌ మనోహరికి ఇవ్వగానే రణవీర్‌ కోపంగా నువ్వు దుర్గ గురించి నిజం చెప్పకపోతే రేపు బర్తుడే ఫంక్షన్‌ లో మన ఇద్దరి గురించి నిజం అమర్‌ కు చెప్తానని బెదిరిస్తాడు. దీంతో మనోహరి ఆలోచనలో పడిపోతుంది.  తర్వాత మనోహరి తన రూంలో టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతూ రణవీర్‌ మాటలు గుర్తు చేసుకుంటుంది. తర్వాత అమ్ము, ఆకాష్‌, అనంద్‌ ముగ్గురు కలిసి అంజును సర్‌ప్రైజ్‌ చేయాలనుకుంటారు. ఏదో బయట ప్రమాదం జరుగుతున్నట్టు భయపడుతూ అంజు దగ్గరకు వెళ్లి అంజు నువ్వేం భయపడకు మేమున్నాం అంటూ అంజును హాల్లోకి తీసుకెళ్తారు.

తర్వాత ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు హాల్లోంచి వెళ్లిపోతారు. అంజు ఒక్కతే ఉంటుంది. ఇంతలో కరెంట్‌ కూడా పోతుంది. దీంతో అంజు భయపడుతూ గట్టిగా అరుస్తుంది. వెంటనే కరెంట్‌ వస్తుంది. అంజుపై పూల వాన కురుస్తుంది. షాక్‌ లోంచి తేరుకున్న అంజు నన్ను సర్‌ప్రైజ్‌ చేశారు కదా? అంటూ అడిగి అందరినీ తిడుతుంది.  అమర్‌ ను కూడా డాడ్‌ మీరు నవ్వుతున్నారా? ఇదంతా చేయడానికి  అసలు మీరెలా ఒప్పుకున్నారు..? అని ప్రశ్నిస్తుంది. దీంతో అమర్‌ నాదేం లేదు ఇదిగో ఇదంతా మిస్సమ్మ ప్లాన్‌ అని చెప్తాడు. దీంతో అంజు కోపంగా మిస్సమ్మా అంటూ అరుస్తుంది. మిస్సమ్మ, పిల్లుల ముగ్గురు కలిసి అంజును ఆట పట్టిస్తారు. వెటకారంగా మాట్లాడతారు. ఇంతలో అమర్‌ సరే ఇక కేక్‌ కట్‌ చేద్దాం అంజు నువ్వు రెడీ అయి రాపో అంటాడు. అంజు లోపలికి వెళ్తుంది.

ఇంటి వెనక నుంచి గోడ దూకి అమర్‌ ఇంట్లోకి వస్తాడు ఘోర. మనోహరి రూం దగ్గరకు వెళ్లి పిలుస్తాడు. ఘోరను చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. అమర్‌ చూశాడంటే నిన్ను, నన్ను చంపేస్తాడని అంటుంది. దీంతో ఘోర మనోహరికి ధైర్యం చెప్పి ఈ ఒక్కరోజు నువ్వు తెగిస్తే మనం గెలుస్తాం మనోహరి అని బ్రెయిన్‌ వాష్‌ చేస్తాడు ఘోర. దీంతో మనోహరి ఘోరాను తన రూంలో ఉండమని ఏవ్వరూ రాకుండా చూస్తానని చెప్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

సుమ అంటే ఎందుకంత క్రేజ్? ఉదయభాను కామెంట్స్ వైరల్

నందుస్ వరల్డ్ డైమండ్ షోరూమ్ వీడియో.. ఊహించని రీతిలో ట్రోలింగ్!

ఈశ్వర్ సాయి మాధురి వివాదం.. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఈశ్వర్ సాయి వైఫ్ శరణ్య!

హీటెక్కించిన కెప్టెన్సీ రేస్.. భయం పుట్టిస్తున్న ఆటలు!

అభిమానులకు పండు మాస్టర్ రిక్వెస్ట్.. ప్లీజ్ ఆ పని చేయండంటూ!

బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి మాట ఎలా రికార్డ్ అవుతుందో తెలుసా?

ఆ స్వేచ్ఛ ఇప్పుడు లేదు.. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

రైతుబిడ్డ ఝాన్సీ పై ట్రోల్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తల్లి!

Big Stories

Advertisement
×