BigTV English

Devara : ఎన్టీఆర్ భార్యగా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన అమ్మాయి ఎవరో తెలుసా?

Devara : ఎన్టీఆర్ భార్యగా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన అమ్మాయి ఎవరో తెలుసా?

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ ‘దేవర’ మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ తో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. కానీ ఆ హీరోయిన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియదనే చెప్పాలి. దీంతో అసలు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకు భార్యగా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న ఆ అమ్మాయి ఎవరు ? అని ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజెన్లు. ఎన్టీఆర్ వైఫ్ గా నటించిన అమ్మాయి ఎవరు? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.


పాపులారిటీ లేకపోయినా పాన్ ఇండియా ఛాన్స్ 

ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అలరించబోతున్న సోలో మూవీ దేవర. గతంలో జనతా గ్యారేజ్ మూవీని చేసిన కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, ఈ పాన్ ఇండియా మూవీ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా, ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు అనే వార్త అంచనాలను పీక్స్ లోకి వెళ్లేలా చేసింది. అయితే ట్రైలర్ లో జనాలు ఓ విషయం దగ్గర మాత్రం ఆగిపోయారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడంతో పాటు ట్రైలర్లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్, సెంటిమెంట్ సీన్లు కనిపించాయి. అ సెంటిమెంట్ సీన్లలో ఎన్టీఆర్ భార్యగా పెద్దగా పరిచయం లేని అమ్మాయి కనిపించింది. ఈ పాన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్ కు భార్యగా ఛాన్స్ దక్కించుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు శృతి మరాఠీ.


Who is Shruti Marathe? Marathi actress who plays Jr NTR's wife in upcoming movie Devara: Part 1 | PINKVILLA

శృతి మరాఠీ ఎవరంటే?

ఈ హీరోయిన్ గుజరాత్ కు చెందిన మోడల్. ఆమె మరాఠీ, హిందీ సినిమాలలో ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు గాని గతంలో కొన్ని తమిళ సినిమాల్లో కూడా కనిపించింది శృతి. అలాగే హిందీలో కొన్ని సీరియల్స్ చేసింది. ఇటీవల కాలంలో కొన్ని వెబ్ సిరీస్ లోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. గౌరవ్ ఘటనేకర్ అనే ప్రముఖ నటుడిని 2016 లోనే ప్రేమించి పెళ్లాడింది. తాజాగా దేవర మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ అమ్మడు.

చాలా ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తుండగా.. తండ్రి దేవర, కొడుకు వరగా రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు యంగ్ టైగర్. కొడుకు వరకు జోడిగా జాహ్నవీ కపూర్ హీరోయిన్ గా నటించగా, దేవరకు భార్యగా శృతి మరాఠీ నటిస్తోంది. ఆమె పాత్రకు సినిమాలో ఎంత స్కోప్ ఉందన్న విషయం తెలీదు గానీ ఎన్టీఆర్ కు శృతి భార్యగా, మరో పాత్రలో తల్లిగా ఆమె చేసిన సెంటిమెంట్ సీన్లు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. అయితే డైరెక్టర్ కొరటాల శివ శృతి మరాఠీ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ భార్య పాత్రకు ఒక కొత్త ముఖాన్ని తీసుకోవాలని అనుకున్నామని, అందుకే ఆమెను తీసుకున్నామని అన్నారు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఈ బ్యూటీ ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×