BigTV English

Devara: జపాన్ లో టైగర్ తాండవం…

Devara: జపాన్ లో టైగర్ తాండవం…

Devara: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర  సినిమా జపాన్‌లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌కు అక్కడ ఉన్న ఫ్యాన్‌బేస్ దేవర సినిమాకి మంచి కలెక్షన్స్ తెచ్చిపెడుతున్నాయి.


జపాన్‌లో ‘దేవర’ కలెక్షన్లు

దేవర సినిమా మార్చి 28, 2025న జపాన్‌లో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్టీఆర్ స్వయంగా జపాన్ వెళ్లి అక్కడి అభిమానులు, మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఎన్టీఆర్ అక్కడే ఉండి స్వయంగా ప్రీమియర్ షోల్లో డాన్స్ వేయడం, జపాన్ సెకండ్ హోమ్ లాంటిది అని చెప్పడంతో అక్కడి ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.


సినిమా మొదటి రోజు 1,553 మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. రెండవ రోజు ఈ సంఖ్య పెరిగి 2,327కి చేరింది. రెండు రోజుల్లో కలిపి 6,188 అడ్మిషన్లు నమోదయ్యాయి. ప్రీమియర్లతో సహా మొదటి రెండు రోజుల్లో దేవర సుమారుగా 11.1 మిలియన్ యెన్‌లు వసూలు చేసింది.

కొన్ని ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సినిమా మొదటి వారంలో 14.3 మిలియన్ యెన్‌లు వసూలు చేసిందని చెబుతున్నారు. మూడవ రోజు కలెక్షన్లు మొదటి రోజు కంటే ఎక్కువగా ఉండటంతో, దేవర జపాన్ మార్కెట్‌లో మంచి గ్రోత్ ని చూస్తోంది. ట్రేడ్ అంచనా ప్రకారం, సినిమా లాంగ్ రన్ కొనసాగితే కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.

తెలుగు సినిమాపై ఆసక్తి చూపించే జపాన్ ఆడియెన్స్ గతంలో బాహుబలి సినిమాలకు విశేష ఆదరణ చూపారు. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ కూడా అక్కడ అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు దేవర లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి.

‘దేవర 2’ – అంతర్జాతీయ స్థాయిలో మరింత గ్రాండ్‌గా

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కథలో మార్పులు చేస్తున్నారు. స్క్రిప్ట్ కేన్‌వాస్‌ను మరింత విస్తరించి, యాక్షన్ మరియు ఎమోషన్‌ను పెంచేలా ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ. మొదటి భాగం కథ, విజువల్స్ పరంగా భారీ స్థాయిలో ఉండగా, సీక్వెల్‌ను ఇంకా పెద్దదిగా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా రూపొందించాలనే ఆలోచనతో టీం పని చేస్తోంది. అలాగే, మొదటి భాగానికి వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చేలా దేవర 2 ఉండబోతుందని సమాచారం. కథనాన్ని, పాత్రల లోతును, మరియు యాక్షన్ సీక్వెన్స్‌లను మెరుగుపరచి, అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రభావం చూపించేలా ఈ భాగాన్ని తెరకెక్కించాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటివరకు అధికారిక సమాచారం బయటకు రాలేదప్పటికీ, కొరటాల శివ మరియు టీం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దేవర 2 మరింత గ్రాండ్‌గా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×