BigTV English

Watermelon: తాజా, తియ్యటి పుచ్చకాయను గుర్తించడం ఎలా ?

Watermelon: తాజా, తియ్యటి పుచ్చకాయను గుర్తించడం ఎలా ?

Watermelon: సమ్మర్ లో పుచ్చకాయలు పుష్కలంగా దొరుకుతాయి. 90 శాతానికి పైగా నీరు ఉండే ఈ పండుకు డిమాండ్ కూడా పెరుగుతుంది. పుచ్చకాయ తాజాగా తియ్య, గా ఉంటే, దానిని తినడం వల్ల కలిగే ఆనందమే వేరు. ఇదిలా ఉంటే చాలా సార్లు పుచ్చకాయ కొని తెచ్చిన తర్వాత అది పాలిపోయి, రుచి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.


కొన్ని సమయాల్లో డబ్బు కూడా వృధా చేసిన భావన కలుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే పుచ్చకాయ కొనేటప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలు పాటించాలి. వాటి సహాయంతో మీరు కొన్ని సెకన్లలోనే తాజా తియ్యటి పుచ్చకాయను గుర్తించవచ్చు.

తాజా, తియ్యని పుచ్చకాయ కొనడానికి చిట్కాలు:
పుచ్చకాయ నాణ్యతను దాని పై భాగం, పరిమాణం, బరువును చూసి కూడా నిర్ణయించవచ్చు. మీరు ఇంటికి తీపి, జ్యూసీ పుచ్చకాయను తీసుకురావాలనుకుంటే.. కొన్ని చిట్కాలను అనుసరించండి. వీటితో మీరు మీ డబ్బు కూడా వృధా కాకుండా ఉంటుంది.


పసుపు రంగు మచ్చలు: ఫీల్డ్ స్పాట్” అని పిలువబడే పుచ్చకాయ అడుగు భాగం ముదురు పసుపు లేదా బంగారు రంగులో ఉంటే.. అది పూర్తిగా పండినది అని అర్థం. అంతే కాకుండా ఇలాంటి పుచ్చకాయ తీపిగా కూడా ఉంటుంది. లేత తెలుపు లేదా ఆకుపచ్చ రంగు మచ్చలు కలిగిన పుచ్చకాయ పండనిది అని గమనించాలి. వీటిని అస్సలు కొనకూడదు.

శబ్దం: పుచ్చకాయను తేలికగా తట్టి వినండి. లోపల నుండి గట్టిగా, లోతైన ప్రతిధ్వనించే శబ్దం వస్తే.. అది బాగా పండిందని అర్థం. శబ్దం గట్టిగా లేదా మృదువుగా అనిపిస్తే, అది పచ్చిగా లేదా పండని పండు అని గుర్తించాలి.

సరైన పరిమాణం, బరువును ఎంచుకోండి : పుచ్చకాయ చాలా పెద్దదిగా లేదా చాలా చిన్నదిగా ఉండకూడదు. మధ్యస్థ పరిమాణంలో ఉంటే.. అత్యంత తియ్యగా ,జ్యూసీగా ఉంటాయి.  అందుకే ఇలాంటి పుచ్చకాయలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. బరువుగా ఉన్న పుచ్చకాయలు బాగా పండినవని గుర్తించండి. ఇలాంటి వాటిని తప్పకుండా కొనాలి.

తొక్క యొక్క ఆకృతి: మెరిసే లేదా మృదువైన తొక్క కలిగిన పుచ్చకాయ తరచుగా పండనిదని గుర్తించండి. చారలతో కూడిన తొక్క ఉన్న పండ్లు బాగా పండినవి. చారలతో ఉన్న పుచ్చకాయలను ఏరీ కోరి తీసుకోండి. ఇవి చాలా రుచిగా  ఉంటాయి.

కాండం : పుచ్చకాయ కాండం పొడిగా మరియు కొద్దిగా వంగి ఉంటే, అది పూర్తిగా పండిందని అర్థం. ఆకుపచ్చగా , తాజాగా కనిపించే కాడ పుచ్చకాయను పండక ముందే కోసినట్లు గుర్తించండి. ఇలాంటి పుచ్చకాయలు రుచిగా ఉండవు. అంతే కాకుండా వీటిని కొనడం వల్ల డబ్బు కూడా వృధా అవుతుంది.

Also Read: ఆముదం ఇలా వాడితే.. జుట్టు ఊడమన్నా ఊడదు

పగుళ్ల పరీక్ష: కొన్ని పుచ్చకాయల ఉపరితలంపై చిన్న చిన్న పగుళ్లు లేదా సాలీడు వల లాంటి గీతలు ఉంటాయి. ఇలాంటి పుచ్చకాయ తియ్యగా ఉంటుందని అంతే కాకుండా ఇవి సహజంగా పండినట్లు గమనించాలి. ఇలాంటి పండ్లు తినడం మంచిది.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×