BigTV English

Chhaava OTT : ఓటీటీలోకి ‘ఛావా’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Chhaava OTT : ఓటీటీలోకి ‘ఛావా’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Chhaava OTT : ఈ ఏడాదిలో బాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి మూవీ ఛావా బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం భారీ సక్సెస్ అయింది.. ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కోట్లు రాబడుతుంది. ఫిబ్రవరి 14 న హిందీలో రిలీజైంది. భారీ కలెక్షన్లను సాధించింది. మార్చిలో తెలుగులోనూ థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లను దక్కించుకుంది. ఇప్పటికి పలు చోట్ల ఛావా హంగామానే కొనసాగుతుంది.. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. మరి ఆలస్యం ఎందుకు? ఏ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసేద్దాం..


Also Read:ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ రెండింటిని మిస్ అవ్వొద్దు..

ఓటీటీ డీటెయిల్స్..


విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఛావా.. ఈ మూవీ ఓటీటీ హక్కులను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు వస్తుందని తాజాగా అంచనాలు బయటికి వచ్చాయి. థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాలకు స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా చావా మేకర్లతో నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ ఏప్రిల్ 11న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఓటిటి డేటు గురించి మేకర్స్ అధికారక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.. ఏమైనా థియేటర్లలో దుమ్ము దులిపేసిన ఈ మూవీ అటు ఓటిటిలో కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీకి ఇప్పటి వరకు సుమారు రూ.780కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇంకా కాస్త థియేట్రికల్ రన్ సాగుతోంది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ ఆస్థాయి భారీ వసూళ్లతో దుమ్మురేపింది.. ఇక ఇందులో అక్షయ్ ఖన్నా, అషుతోశ్ రాణా, డయానా పెంటీ, నీల్ భూపాలమ్, దివ్య దత్తా లతో పాటు మరికొందరు కీలక పాత్రల్లో కనిపించారు..

స్టోరీ విషయానికొస్తే.. 

ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక మూవీ ఛావా లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. మరాఠా యోధుడు ఛత్రవతి శివాజీ మహరాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.. చరిత్రను తలపించేలా స్టోరీ ఉండటంతో ఆడియన్స్ ప్రశంసలు దక్కాయి. సంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించి మెప్పించాడు.. రష్మిక మందన్న ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో జీవిస్తుందని ఈ మూవీతో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది..

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×