BigTV English

Devara Release : జపాన్‌లో దేవర తాండవం… ఫ్యాన్స్ రియాక్షన్ మామూలుగా లేదు భయ్యా…

Devara Release : జపాన్‌లో దేవర తాండవం… ఫ్యాన్స్ రియాక్షన్ మామూలుగా లేదు భయ్యా…

Devara Release ..రాజమౌళి (Rajamouli) పుణ్యమా అని.. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా ఎదిగి ఇతర దేశాల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇక జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR)గత ఏడాది నటించిన దేవర మూవీ నెగిటివ్ టాక్ తో కూడా ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. అంతే కాదు కొన్ని థియేటర్లలో వంద రోజులు కూడా ఆడింది. అయితే అలాంటి దేవర సినిమా(Devara Movie) కి సంబంధించి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే దేవర సినిమాని జపాన్ లో విడుదల చేయబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి ఇంతకీ దేవర మూవీ జపాన్ లో ఏ తేదీన విడుదలవబోతుందో ఇప్పుడు చూద్దాం.


జపాన్ లో విడుదలకు సిద్ధమవుతున్న దేవర..

జపాన్లో మన తెలుగు హీరోలకు మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రభాస్ (Prabhas) కి, ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan)లకి కూడా జపాన్లో మార్కెట్ ఏర్పడింది. దీంతో ఇక్కడ విడుదలైన చాలా సినిమాలు జపాన్లో కూడా విడుదలై భారీ లాభాలు తెచ్చి పడుతున్నాయి. అయితే తాజాగా దేవర మూవీ కూడా జపాన్ లో విడుదల చేయడానికి సిద్ధమైపోయారు మూవీ మేకర్స్.ఇక జపాన్లో దేవర మూవీ ఎప్పుడు విడుదలవబోతుంది అంటే వచ్చే నెల అనగా మార్చి 28న ఈ సినిమా జపాన్ థియేటర్లలో సందడి చేయబోతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లకు జపాన్ లో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. గతంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ లు జపాన్ వెళ్ళినప్పుడు అక్కడి అభిమానులు వీరిని ఎంత ప్రేమగా రిసీవ్ చేసుకున్నారో చెప్పనక్కర్లేదు.


ప్రమోషన్స్ అప్పటి నుండే షురూ..

అలా మార్చి 28న దేవర మూవీ జపాన్ లో విడుదలవబోతుందని తెలియగానే అక్కడి ఫ్యాన్స్ అందరూ తెగ సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా జపాన్లో ఉండే తెలుగు వాళ్లయితే ఎగిరి గంతేసినంత పని చేస్తున్నారు. ఇక జపాన్ (Japan) లో దేవర సినిమా విడుదల కాబోతుండడంతో మార్చి 22న ఎన్టీఆర్ జపాన్ కి వెళ్లి అక్కడ ప్రమోషన్స్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే జపాన్ మీడియా ఛానల్స్ తో ఆన్లైన్లో ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు ఇస్తున్న ఫోటో ఒకటి ఎన్టీఆర్ టీం షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అయింది.ఇక కొరటాల శివ (Koratala Shiva) డైరెక్షన్లో వచ్చిన దేవర 2024 సెప్టెంబర్ 27న విడుదలైన బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. మరి జపాన్ అభిమానులను దేవర మూవీ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×