Brahmanda Teaser : ఒగ్గు కథ ఆధారంగా రూపొందుతున్న అచ్చ తెలంగాణ మూవీ ‘బ్రహ్మాండ’ (Brahmanda). మూవీ టీజర్ ని ‘తండేల్’ మూవీ డైరెక్టర్ చందూ మొండేటి (Chandu Mondeti) తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మూవీ సక్సెస్ కావాలని కోరుతూ, టీజర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మరి ‘బ్రహ్మాండ’ టీజర్ ఎలా ఉంది? డైరెక్టర్ చందూ మొండేటి ఈ టీజర్ పై చేసిన కామెంట్స్ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
‘బ్రహ్మాండ’ టీజర్ రిలీజ్
ఆమని ప్రధాన పాత్రలో మమత ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న మూవీ ‘బ్రహ్మాండ’. ఈ మూవీలో జయరామ్, కొమరం బన్నీ రాజ్, కనిక వాద్య, జోగిని శ్యామల, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, దిల్ రమేష్, ఛత్రపతి శేఖర్, ప్రసన్నకుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాంబాబు ఈ మూవీకి దర్శకత్వం వహించగా, వరికుప్పల యాదగిరి సంగీతం అందిస్తున్నారు. దాసరి సురేష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
రీసెంట్ గా ‘తండేల్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ చందూ మొండేటి చేతుల మీదుగా ‘బ్రహ్మాండ’ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ తన సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో, ‘బ్రహ్మాండ’ మూవీ కూడా అలాంటి సక్సెస్ ని అందుకోవాలని కోరుకున్నారు. టీజర్ ను చూసిన అనంతరం అందులో ఉన్న డిజైన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని కొనియాడారు. అలాగే సినిమా యూనిట్ అందరికీ మూవీ హిట్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
అనంతరం దాసరి సురేష్ మాట్లాడుతూ చందూ మొండేటి తమ సినిమా ‘బ్రహ్మాండ’ టీజర్ ను రిలీజ్ చేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక డైరెక్టర్ రాంబాబు ‘తండేల్’ వంటి హిట్ మూవీ డైరెక్టర్ చందూ మొండేటి ఈ మూవీ టీజర్ ను ఆవిష్కరించడం మొదటి విజయంగా భావిస్తున్నాను అని వెల్లడించారు.
‘బ్రహ్మాండ’ అనే మూవీ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో సాగుతుంది. ఒగ్గు కళాకారుల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఒగ్గు కథ అనేది తెలంగాణ జానపద కళల్లో ఒకటి. ఒగ్గు అంటే శివుని చేతిలో ఉన్న ఢమరుకం అనే అర్థం వస్తుంది. తెలంగాణలో మాత్రమే వినిపించే అచ్చమైన ఈ దేశీ పదం, ఒగ్గు కథ, ఆ కళకు సంబంధించిన కళాకారుల జీవితం నేపథ్యంలో ‘బ్రహ్మాండ’ సినిమా రూపొందుతుండడం ఆసక్తికరంగా మారింది.
‘తండేల్’ 24 రోజుల కలెక్షన్స్
ఇక ‘తండేల్’ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ చందూ మొండేటి. ‘తండేల్’ మూవీ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.