E-Paper
Advertisement

Devara Movie update : న్యూ ఇయర్ ట్రీట్ .. ఎన్టీఆర్ అభిమానులకు దేవర మైండ్ బ్లోయింగ్ అప్డేట్..

Devara Movie update : న్యూ ఇయర్ ట్రీట్ .. ఎన్టీఆర్ అభిమానులకు దేవర మైండ్ బ్లోయింగ్ అప్డేట్..
Advertisement
DEVARA  Movie update

Devara  Movie update : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక్క హిట్టు పడితే చాలు ఇక హీరోకి విపరీతమైన క్రేజ్ వస్తుంది అతను నెక్స్ట్ మూవీ పై అంచనాలు భారీగా పెరుగుతాయి మరి అలాంటిది ఒకదాని తర్వాత ఒకటి.. ఆరు హిట్లు అందుకున్నాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ చిత్రం తో వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చుకోవడమే కాకుండా.. విదేశాలలో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.

భారీ అంచనాల మధ్య తరికెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది .యదార్ధ సంఘటనల ఆధారంగా చిత్రీకరిస్తున్న ఈ చిత్రం చాలావరకు సముద్రం సంబంధించిన నేపథ్యంలో సాగుతుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ మునిపెన్నడూ కనిపించనంత డిఫరెంట్ స్టైల్ లో కనిపించనున్నాడు అని టాక్. ఇక ఈ చిత్రం సమ్మర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ కోసం తారక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Advertisement

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ గత మార్చిలో మొదలైంది.. అప్పటినుంచి నిర్విరామంగా వరుస షెడ్యూల్ తో ప్లాన్ చేసుకుంటూ చాలా వరకు మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు. రీసెంట్ గా మూవీకి సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ గోవా సముద్ర తీరాలలో  జరిగింది. ఈ మూవీ కూడా రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు. అందుకే జనవరి నుంచి మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ చేపట్టాలి అని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు టాక్.

ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు కొన్ని ప్రచార పోస్టర్లు మాత్రమే వచ్చాయి. ఎన్టీఆర్ మూవీ నుంచి అప్డేట్ సరిగ్గా రావడంలేదని ఇప్పటికే అతని అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ చిత్రం నుంచి గ్లింప్స్ వీడియోని విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. ఇంతకీ ఎప్పుడో తెలుసా.. ఎన్టీఆర్ అభిమానులకు నూతన సంవత్సర కానుకగా దేవర చిత్రం నుంచి గ్లింప్స్ వీడియోను జనవరి 1న మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ మూవీకి యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తుండగా, విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×