BigTV English

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Devara: మిర్చిలో ఒక డైలాగ్ ఉంటుంది.. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని.. ఇప్పుడు  అది నిజమని దేవర కటౌట్స్ చూస్తే అర్థమవుతుందని నెటిజన్స్  మాట్లాడుకుంటున్నారు.  సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా  రిలీజ్ అవుతుంది అంటే.. రిలీజ్ కు ముందురోజో.. లేకపోతే రెండు రోజులకు ముందో  థియేటర్స్ వద్ద  సందడి మొదలవుతుంది.  కానీ, హీరోల ఫ్యాన్స్ యందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరయ్య  అంటే అతిశయోక్తి కాదు. మరి లేకపోతే.. సినిమా రిలీజ్ కు ఇంకా వారం ఉంది. అయినా  ఇంకా ముందే మాస్  సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. అది  ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే.


ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా  నుంచి రిలీజైన  ప్రమోషన్ కంటెంట్ కూడా అద్భుతంగా  వర్క్ అవుట్ అయ్యింది. ఇన్ సైడ్ టాక్ ను బట్టి దేవర పాజిటివ్ గానే ఉందన్న మాట వినిపిస్తుంది. ఇక  ఇంకోపక్క ఎన్టీఆర్  ఫ్యాన్స్ వారం ముందే  మాస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు.

కటౌట్ సెలబ్రేషన్స్ పేరుతో.. అన్ని థియేటర్ల వద్ద దేవర కటౌట్స్ పెట్టి.. పూలాభిషేకాలు, పాలాభిషేకాలు.. కొన్నిచోట్ల అయితే రక్తాభిషేకాలు కూడా చేశారు.  తిరుపతి, గూడూరు, కందుకూర్, నెల్లూరు, అనంతపురం, మదనపల్లి, విజయవాడ, హైదరాబాద్ ఇలా  ఒక్కటి కూడా వదలకుండా అన్ని థియేటర్స్ వద్ద దేవర  కటౌట్స్ కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఈ కటౌట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  ఇది ఈరోజు నుంచే మొదలయ్యింది కాబట్టి.. ఇలాంటి కటౌట్స్ ముందు ముందు ఇంకా ఎక్కువే వస్తాయి.


ఇకపోతే ఇంత సెలబ్రేషన్స్ చేస్తున్నా..   అభిమానుల గుండెల్లో ఎక్కడో.. ఏదో ఒక మూల  దేవర రిజల్ట్ పై  అనుమానం ఉందనే చెప్పాలి. కథ నచ్చినా.. బయటకు వచ్చి నెగెటివిటీ క్రియేట్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇంకోపక్క  రాజమౌళి సెంటిమెంట్ ఉండనే ఉంది. ఏ చిన్న మిస్టేక్ జరిగినా.. తారక్ కు ఏమో కానీ కొరటాలను మాత్రం ఏకిపారేస్తారు అన్నది నమ్మదగ్గ  నిజం.

ఇప్పటికే దేవర సినిమా.. కొంతమంది  ఆంధ్రావాలా అంటుంటే.. ఇంకొందరు భీమా అంటున్నారు. మరికొందరు  ఆచార్య 2 అంటున్నారు. ఇన్ని  అనుమానాల మధ్య.. ఎన్నో అంచనాల నడుమ   దేవర రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్.. రాజమౌళి సెంటిమెట్ ను బ్రేక్ చేస్తాడా.. ? కొరటాల ఆచార్య లాంటి డిజాస్టర్  తరువాత   హిట్ అందుకుంటాడా.. ?  ఇవే సెలబ్రేషన్స్ ఫ్యాన్స్.. దేవర రిలీజ్ తరువాత చేస్తారా.. ? అనేది తెలియాలంటే ఇంకో వారం రోజులు ఆగాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×