Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక ఎన్నో వాయిదాల తరువాత దేవర సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నే అందుకుంది. దాదాపు ఆరేళ్ళ తరువాత ఎన్టీఆర్.. సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దేవర సినిమా రిలీజ్ అవ్వకముందు వరకు ఆ సినిమాపై ఎన్నో అనుమానాలు.. రాజమౌళి సెంటిమెంట్ ఒకపక్క.. కొరటాల ప్లాప్ ఒక పక్క.. దేవర ట్రైలర్ నెగెటివ్ టాక్ ఇంకోపక్క.. ఇలా సినిమా రిలీజ్ వరకు వీటన్నింటిని క్యారీ చేస్తూనే ప్రేక్షకులు సినిమా చూశారు. రాజమౌళి సినిమా చేసిన తరువాత ఏ హీరోకు అయినా కచ్చితంగా డిజాస్టర్ పడుతుంది అన్న సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. దేవర మిక్స్డ్ టాక్ అందుకున్నా కూడా.. డిజాస్టర్ టాక్ ను మాత్రం అందుకోలేదు. దీంతో దేవరకు ఇది ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
సినిమా రిలీజ్ కు ముందు దేవర ప్రమోషన్స్ కూడా ఎన్టీఆర్ అంతంత మాత్రమే చేశాడు. ఇద్దరు, ముగ్గురు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు, బాలీవుడ్ ఒక షోకు అటెండ్ అవ్వడం అంతే. ప్రీ రిలీజ్ ఈవెంట్.. అబ్బా .. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంతో కష్టపడి, టికెట్స్ కొని.. లోపలికి వెళ్లే టైమ్ కు ఈవెంట్ క్యాన్సిల్ చేసేశారు. ఇది మేకర్స్ తప్పా.. నోవాటెల్ యాజమాన్యంది తప్పా.. ? అని ఇప్పటివరకు తెలిసింది లేదు. ఏ సినిమాకు అయినా ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం.
దేవర సినిమా ఎలా ఉన్నా .. ఎన్టీఆర్ ప్రమోషన్స్ వలన ఇంకా హైప్ వచ్చేది. పోనీ.. సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగూ నిర్వహించలేదు.. కనీసం సక్సెస్ మీట్ ను అయినా నిర్వహించి అయినా ఫ్యాన్స్ ను సంతోష పెట్టాలని చూశారు. కానీ, ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ కు కూడా అడ్డంకులు తప్పలేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. దేవర నిర్మాతలు ఒక ప్రైవేట్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతుంది. ఈరోజు రాత్రి హయాత్ హోటల్ లో దేవర నిర్మాతలు, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ అధినేతలు అయిన సుధాకర్ మిక్కిలినేని, హరి కొసరాజు.. హోల్ సేల్ బయ్యర్ అయిన సూర్యదేవర నాగవంశీ కలిసి ఈ పార్టీని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ పార్టీకి పంపిణీదారులు, ఇండస్ట్రీ పెద్దలు కొందరు హాజరవుతున్నారని తెలుస్తోంది. వీలైతే ఎన్టీఆర్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేస్తారనుకుంటే.. మీకు మీరు సక్సెస్ పార్టీలు పెట్టుకుంటున్నారా.. ? మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సక్సెస్ మీట్ ఎప్పుడు ఉండనుందో కాలమే నిర్ణయించాలి.