BigTV English

Devara Success Meet: ఈ హరి ఎవరు? ఎన్టీఆర్ ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం.?

Devara Success Meet: ఈ హరి ఎవరు? ఎన్టీఆర్ ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం.?

Devara Success Meet.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదలయి ప్రస్తుతం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి రోజే ఈ సినిమా రూ.172 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డులు సృష్టించిన ఈ సినిమా.. ప్రస్తుతం రూ.500 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా సినిమాకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలి అనుకోగా.. అభిమానులు ఎక్కువగా రావడంతో భద్రత కారణంగా క్యాన్సిల్ చేశారు. ఇక సినిమా హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్ పెట్టుకోవాలనుకుంటే దీనికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని సమాచారం. దీంతో చిత్ర బృందం మాత్రమే అతి తక్కువ మందితో ఈ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.


ఎన్టీఆర్ కి రామ బంటుగా మారిన హరి..

అయితే ఈ సక్సెస్ ఈవెంట్లో ప్రత్యేకంగా హరి అనే వ్యక్తి పేరు ప్రస్తావనకు తీసుకొస్తూ.. పదేపదే అతడి పేరును తలుచుకుంటూ తెగ స్పీచ్ ఇచ్చారు ఎన్టీఆర్. సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మా హరి ఎప్పుడు కూడా ముందుకు రాడు. వెనకాలే ఉంటాడు. చాలామంది ఎన్నో రకాలుగా హరిని అర్థం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకొచ్చి తన గురించి ఏమి చెప్పకూడదు. కాబట్టి ఎవరు ఏమి అన్నా అనుకున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కి మాత్రం అతడే మూల స్తంభం నాకు కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ కూడా హరినే స్ట్రెంత్.. అయితే నచ్చిన వాళ్లు ఈ విషయాన్ని జీర్ణించుకుంటే నచ్చని జీర్ణించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ ఎన్టీఆర్ తెలిపారు. మరి ఈ హరి ఎవరు? ఎందుకు ఎన్టీఆర్ ఇంతలా ఇష్టపడుతున్నారు? అసలు హరి పై వస్తున్న నిందలు ఏమిటి? హరి తారక్ ఏమవుతారు? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


కళ్యాణ్ రామ్ బామ్మర్దే హరి..

మరి ఎన్టీఆర్ ఇంతలా చెబుతున్న ఆ హరి ఎవరో కాదు కళ్యాణ్ రామ్ కి స్వయాన బామ్మర్ది.. అంటే కళ్యాణ్ రామ్ భార్య స్వాతి తమ్ముడు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ అంటే హరి కి చాలా ఇష్టం. ముఖ్యంగా వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉండే వ్యక్తి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సినిమా వ్యవహారాల మొత్తం ఈయనే చూసుకుంటారు. అంతే కాదు గతంలో ఎన్టీఆర్ కి మేనేజర్ గా కూడా పనిచేశారు. కోనేరు మహేష్ చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ వెంటే ఉంటూ ఎన్టీఆర్ సినిమా పనుల పూర్తి బాధ్యతలు తన భుజాన వేసుకున్నారు. ఒక్కరకంగా చెప్పాలి అంటే హరి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బంటు అనడంలో సందేహం లేదు. అంతేకాదు ఎలాంటి శత్రువులు లేని అజాతశత్రువు. అందుకే ఎన్టీఆర్ కి హరి అంటే అంత అభిమానం.

హరి పై నిందలు.. తట్టుకోలేకపోతున్న ఎన్టీఆర్..

అయితే ఇంత ఇష్టమైన హరి పై ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ సర్కిల్లో చాలా బ్యాడ్ వార్తలు వినిపించాయి. హరి వచ్చాకే ఎన్టీఆర్ కి, అభిమానులకి మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ నడుస్తోంది. అందుకే హరిని తీసేయాలని కొంతమంది కామెంట్లు కూడా చేశారు. దేవర ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అవడానికి కూడా హరి కారణం అంటూ వార్తలు వచ్చాయి. మొత్తానికి అయితే కష్టపడే హరిని అభిమానులు ద్వేషించడంతో ఎన్టీఆర్ తట్టుకోలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×