BigTV English
Advertisement

iPhone SE 4 : ఐఫోన్ ఎస్ఈ 4 ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్.. డిస్ ప్లే, ఫీచర్స్ కిర్రాక్ బాస్

iPhone SE 4 : ఐఫోన్ ఎస్ఈ 4 ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్.. డిస్ ప్లే, ఫీచర్స్ కిర్రాక్ బాస్

iPhone SE 4 :  ఆపిల్ కంపెనీ అందుబాటు ధరలో ఎస్ఈ 4 మొబైల్స్ ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ ఫోన్ లాంచింగ్ పై అంచనాలు మిన్నంటిన నేపథ్యంలో తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ సైతం లీక్ అయ్యాయి. అద్భుతమైన స్పెసిఫికేషన్స్ తో పాటు అదిరిపోయే ఫీచర్స్ తో ఈ మొబైల్ లో ఆపిల్ లాంచ్ చేయనుంది.


ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్.. ఇప్పటికే లేటెస్ట్ మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా విడుదలైన ఐఫోన్ 16 సిరీస్ లో ఐఫోన్ 16 ప్లస్, ఐ ఫోన్ 16, ఐ ఫోన్ 16 ప్రో  మాక్స్ మోడల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక వీటీతో పాటు అందుబాటు ధరలో ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్ ను లాంచ్ చేయనుంది. ఈ మొబైల్ వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానున్నట్టు బ్లూమ్‌బర్క్‌ మార్క్‌ గుర్మన్‌ లీక్స్‌ అనే సంస్థ వెల్లడించింది. అత్యాధునిక ఫీచర్స్ తో పాటు అదిరిపోయే అప్డేట్స్ ను తీసుకొస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్, ఫేస్ ఐడి యాక్షన్ బటన్ వంటి ఫీచర్స్ తో మొబైల్స్ మార్కెట్లోకి విడుదల చేసింది.

ALSO READ : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్స్ తో వచ్చేసిన ఎయిర్టెల్


డిజైన్ – ఎస్ఈ 4 మొబైల్ హ్యాండ్ సెట్ ఐఫోన్ 14 డిజైన్తో రానుంది. ఇప్పటి వరకూ కేవలం మూడు ఎస్ఈ మొబైల్స్ మాత్రమే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటికే విడుదలైన ఆపిల్ ఐఫోన్ మోడల్స్ తో పోలిస్తే భారీ ఓఎల్ఈడి డిస్ప్లేన్ కలిగి ఉంటుందని తెలుస్తుంది. హెడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ తో రాబోతుంది. ఐఫోన్ ఎస్ఈ3లో కేవలం 4.7 అంగుళాల డిస్ ప్లే ఉండగా… ఐఫోన్ ఎస్ఈ 4లో 6.1 అంగుళాల ఓఎల్ఈడి డిస్ ప్లే ఉండనుంది.

ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ – ఐఫోన్, ఐఫోన్ ప్రో మాక్స్, ఐ ఫోన్ 16 సిరీస్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌.. కొత్తగా లాంచ్‌ కానున్న ఐఫోన్‌ SEలో కూడా రానుంది. యాక్షన్ బటన్, యు ఎస్ బి – C చార్జింగ్ పోర్ట్, 8జీబీ ర్యామ్, 48 MP కెమెరాతో రాబోతుంది.

ధర – ఇప్పుడు తాజాగా రాబోతున్న మొబైల్ అత్యాధునిక ఫీచర్లతో రావటంతో ముందు వాటి కంటే కాస్త ధర ఎక్కువగా ఉండేట్లు తెలుస్తుంది. ఎస్ఈ 3 మెుబైల్ ధర రూ.43000 ఉండగా… ఐఫోన్ ఎస్ఈ రూ. 49900 ఉండనుంది.

ఆపిల్ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.79,900 గా ఉంది. ఈ ఫోన్ 256GB స్టోరేజీ ధర రూ.89,900 కాగా 512GB స్టోరేజీ ధర రూ.1,09,900 గా ఉంది. ఇక ఐఫోన్‌ 16 ప్లస్‌ మోడల్‌ 128GB స్టోరేజీ ధర రూ.89,900 కాగా 256GB స్టోరేజీ ధర రూ.99,900గా ఉంది. ఇక 512GB స్టోరేజీ ధర రూ.1,19,900 గా ఉంది.

ఐఫోన్‌ 16 ప్రో 128GB స్టోరేజీ ధర రూ.1,19,900 కాగా 256GB స్టోరేజీ ధర రూ.1,29,900 ఉంది. 512GB స్టోరేజీ ధర రూ.1,49,900 ఉండగా…  1TB స్టోరేజీ ధర రూ.1,69,900 గా ఉంది.

ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ 256GB స్టోరేజీ ధర రూ.1,44,900 ఉండగా…  512GB స్టోరేజీ ధర రూ.1,64,900 గా ఉంది. ఇక 1TB స్టోరేజీ ధర రూ.1,84,900 గా ఉంది. ఇక వీటితో పోలిస్తే ఐఫోన్ ఎస్ఈ మోడల్ ధర కాస్త తక్కవగా ఉంటుందని చెప్పొచ్చు.

Related News

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Big Stories

×