BigTV English

Devara Update: దేవర నుంచి అదిరిపోయే అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఖరారు

Devara Update: దేవర నుంచి అదిరిపోయే అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఖరారు

Devara Update: నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ నుంచి క్రేజీ అప్డేట్‌ను మేకర్స్ అందించారు. గ్లింప్స్ రిలీజ్ డేట్‌ను తాజాగా వెల్లడించారు.


యంగ్ టైగర్ ఎన్టీఆర్, క్రియేటివ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం అత్యంత భారీ హైప్‌తో రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్ ప్రేక్షకాభిమానుల్లో ఎన్నో అంచనాలను పెంచేసింది. అంతేకాకుండా సినిమా మోస్ట్ వైలెన్స్, మాస్‌గా ఉంటుందని చెప్పడంతో అంచనాలు మరింత పెరిగాయి.

ఇక గత కొన్నిరోజులుగా ఈ మూవీ టీజర్ త్వరలో రాబోతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, నిర్మాత కల్యాణ్ రామ్ కూడా దేవర టీజర్ రెడీ అయింది అంటూ ఇటీవలే మరింత హైప్ పెంచారు. దీంతో ఈ టీజర్‌ కోసం ఎంతోగానో ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కళ నెరవేరింది.


న్యూ ఇయర్ సందర్భంగా నేడు దేవర సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్‌ను మేకర్స్ అందించారు. ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. జనవరి 8న ఈ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ సీరియస్‌గా ఉండటం చూడవచ్చు. బ్లాక్ డ్రెస్‌లో టక్ వేసుకొని పడవలో నించొని సముద్రంలోంచి వస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఈ అప్డేట్‌తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×