Pushpa 2:ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప -2 (Pushpa-2). డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పుష్ప -2 ఫస్ట్ ఆఫ్ ఎప్పుడో పూర్తి చేశారు. ఇక సెకండ్ ఆఫ్ ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పాలి. అయితే ఇప్పుడు పుష్ప -2 మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నుంచి దేవిశ్రీప్రసాద్ ను తప్పించారని, తమన్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. దీనికి తోడు దీనిపై తమన్ కూడా క్లారిటీ ఇవ్వగా.. ఆయన మాటలతో దేవిశ్రీప్రసాద్ ఫీల్ అయినట్లు సమాచారం. మరి తమన్ ఏం చెప్పాడు..? డిఎస్పి ఎందుకు ఫీలయ్యాడు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
పుష్ప -2 మ్యూజిక్ పై తమన్ కామెంట్స్..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా తమన్.. బాలకృష్ణ (Balakrishna ), బాబీ(Bobby )కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ (Daku Maharaj) మూవీ టీజర్ లాంచ్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పుష్ప -2 కు నేను కూడా పనిచేశాను. ఇందులో చాలా మంది దర్శకులు పనిచేస్తున్నారు. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది. ఎడిటింగ్ రూమ్ లో నేను చూసిన తర్వాత.. ఈ సినిమాకి మ్యూజిక్ ఇంకా బెస్ట్ గా వచ్చింది. అంటూ సినిమాపై హైప్ పెంచారు. అయితే ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. దీనిపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఫీల్ అయినట్లు సమాచారం.
తమన్ మాటలకు ఫీలైన దేవిశ్రీప్రసాద్..
ఇక నిన్నటి ఈవెంట్ లో తమన్ ఈ మాటలు చెప్పడంతో వెంటనే ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ నచ్చకపోవడంతోనే తమన్ తో పుష్ప -2 చిత్రానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేయించారంటూ ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇది కాస్త దేవిశ్రీప్రసాద్ కి ఇబ్బందిగా మారిందని, తమన్ మాటలతో ఆయన చాలా బాధపడ్డారు అని సమాచారం. మరి దీనిపై చిత్ర బృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
విడుదలకు ముందు ఈ ఎడబాటేంటో..
ఇకపోతే గతంలో వచ్చిన పుష్ప సినిమా రెండు భాగాలకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. పుష్ప మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా ఈయన చేసిన స్పెషల్ సాంగ్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు పుష్ప -2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో స్పీడు పెంచాలని భావించిన డైరెక్టర్ సుకుమార్(Sukumar) కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లతో రీ రికార్డింగ్ చేయిస్తున్నాడు. అందులో తమన్ కూడా ఒకరు. అయితే మ్యూజిక్ ఎవరు చేస్తారన్నదానిపై చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి న్యూస్ బయటకి వదలలేదు. కానీ డాకు మహారాజ్ సినిమా టీజర్ లాంచ్ లో తమన్ ఇలా మాట్లాడటంతో ఆయన ఫీల్ అయినట్టు సమాచారం. ఇకపోతే సరిగ్గా సినిమా విడుదల సమయంలో తమన్ ఇలాంటి మాటలు మాట్లాడడంతో.. మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య ఎడబాటు పెరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.