Mike Tyson vs Jake Paul Netflix| అమెరికాలోని టెక్సాస్ లో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, యూట్యూబర్ బాక్సర్ జేక్ పాల్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ మ్యాచ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టెక్సాస్ లోని ఎటి అండ్ టి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కు హౌస్ ఫుల్ బోర్డు పడిండి. 70000 మంది మైక్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ చూడడానికి స్టేడియంకు వచ్చారు. ఈ మ్యాచ్ లైవ్ టికెట్ సేల్స్ ద్వారా 17.5 మిలియన్ డాలర్లు వచ్చాయని సమాచారం. అయితే ఈ అరుదైన మ్యాచ్ స్ట్రీమిండ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది.
పైగా నెట్‌ఫ్లిక్స్ తన సబ్స్‌క్రైబర్స్ అందరికీ ఈ మ్యాచ్ ఫ్రీగా వీక్షించవచ్చని ప్రకటించడంతో.. మ్యాచ్ ప్రారంభైనప్పటి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ యూజర్లంతా సోషల్ మీడియాలో అసహనంగా కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్ లైవ్ జరుగుతుంటే మధ్యలో అంతా బఫరింగ్ వస్తోందని, ఆడియో సరిగా వినిపించడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ మరీ ఇంత దారుణమైన సర్వీస్ అందిస్తోందా? అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
ఇంకొక యూజర్ అయితే.. “లెజెండర్ బాక్సర్ ఇవాండర్ హోలీఫీల్డ్ కామెంటేటర్ రావడం చాలా ఆసక్తి కలిగించింది. కానీ ఆయన కామెంటేటరీ విందామనుకుంటే ఆడియోనే వినిపించడం.. ప్రతిసారి బఫరింగ్ జరగడం వల్ల వీడియో చూడాలనే మూడ్ దొబ్బింది” అని రాశాడు.
మైక్ టైసన్ వర్సెస్ జేక్ పాల్ ఫైట్
ఈ మ్యాచ్ లో 58 ఏళ్ల బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ 27 ఏళ్ల కుర్ర యూట్యూబర్ జేక్ పాల్ తో ఫైట్ చేస్తున్నాడు. మైక్ టైసన్ అధికారికంగా బాక్సింగ్ రింగ్ లో భారీ జనం ముందు ఫైట్ చేయడం గత 19 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ గత సంవత్సర కాలంగా వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఈ మ్యాచ్ గత వేసవి కాలంలో జరగాల్సి ఉండగా.. టైసన్ అనారోగ్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
మ్యాచ్ ఫీజు ఎవరికి ఎంత?
మైక్ టైసన్ ఈ మ్యాచ్ కోసం 20 మిలియన్ డాలర్లు తీసుకున్నాడని అమెరికా మీడియా తెలిపింది. మరోవైపు బాక్సర్ అవతారమెత్తిన ఫేమస్ యుట్యూబర్ జేక్ పాల్ ఈ మ్యాచ్ కోసం ఏకంగా 40 మిలియన్ డాలర్లు చార్జ్ చేశాడట. ఇద్దరు ఫైటర్ల మధ్య గత రెండు సంవత్సరాలుగా మాటల యుద్ధం నడుస్తోంది. టెక్సాస్ లో నవంబర్ 14న సెరెమోనియల్ వే ఇన్ (బరువు చెక్ చేసే కార్యక్రమం)లో జేక్ పౌల్ ముఖంపై మైక్ టైసన్ గట్టిగా కొట్టేశాడు. అప్పుడు జేక్ పౌల్ పబ్లిక్ ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. “మైక్ టైసన్ నన్ను కొడుతూ ఉంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మ్యాచ్ లో మాత్రం అలా జరగదు.. నా చేతిలో టైసన్ చావు దెబ్బలు తింటాడు. అప్పుడు మీ ముఖాలు నేను చూస్తాను”, అని అన్నాడు.
ఈ మ్యాచ్ టికెట్స్ కు విపరీతంగా క్రేజ్ ఉండడంతో విఐపి ప్యాకేజీ టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్కో విఐపీ టికెట్ 5000 డాలర్ల నుంచి 25000 డాలర్ల వరకు ధర పలికింది.
Also Read: టాయిలెట్ లో ఎక్కువ సమయం గడిపితే ఆరోగ్యానికి ప్రమాదం.. హెచ్చరిస్తున్న వైద్యులు
మైక్ టైసన్ బాక్సింగ్ రికార్డ్
హెవీవెయిట్ బాక్సర్ మైక్ టైసన్ కెరీర్ రికార్డ్ తిరగేస్తే.. అతను తన కెరీర్లో మొత్తం 56 అధికారిక మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 50 మ్యాచ్‌లలో ప్రత్యర్థులను తన బలమైన పంచులతో మట్టికరింపించగా.. కేవలం 6 మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యాడు. గెలిచిన్ 50 మ్యాచ్ లలో 44 మ్యాచ్ లు నాకౌట్ తో విజయం సాధించడం విశేషం. మరోవైపు యూట్యూబర్ బాక్సర్ జేక్ పాల్ తన కెరీర్లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ లలో 10 మ్యాచ్ లు గెలిచాడు. అయితే గెలిచిన మ్యాచ్ లలో ఎక్కువగా యుఎఫ్‌సి ఫైటర్లు, ఎన్‌బిఏ ప్లేయర్లే ఉన్నారు. వారంతా రెగులర్ బాక్సర్లు కాదు. అయితే ఓడిపోయిన ఒక్క మ్యాచ్ లో మాత్రం అతని ప్రత్యర్థి టామీ ఫ్యూరీ ఒక మంచి బాక్సర్. దీంతో జేక్ పౌల్ బాక్సింగ్ స్కిల్స్ పై అనుమానాలున్నాయి.
హెవీవెయిట్ బాక్సింగ్ చరిత్రలో మైక్ టైసన్ ఒక గొప్ప బాక్సర్ గా పేరు పొందాడు. 1987 నుంచి 1990 వరకు అతను అన్‌డిస్పూటెడ్ వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్ గా ఉన్నాడు. కానీ ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగోలేదని.. ఈ మ్యాచ్ లో అతని తలకు గాయాలైతే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు ముందుగానే హెచ్చరించారు.