E-Paper
Advertisement

Devi Sri Prasad: ఫ్యాన్స్ అనిరుద్ కావాలి అనడంపై దేవిశ్రీప్రసాద్ రియాక్షన్

Devi Sri Prasad: ఫ్యాన్స్ అనిరుద్ కావాలి అనడంపై దేవిశ్రీప్రసాద్ రియాక్షన్
Advertisement

Devi Sri Prasad: కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే సంచలమైన దర్శకుడుగా పేరు సాధించుకున్నాడు అనిరుద్ రవిచంద్రన్. ధనుష్ నటించిన త్రి సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో ఒక పాటతో ఒక సంచలనానికి తెర తీసాడు. కేవలం ఆ పాట కోసమే థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ కూడా ఉన్నారని చెప్పాలి. కానీ సినిమా మాత్రం ఊహించిన స్థాయిలో ఆడలేదు కానీ సంగీత దర్శకుడుగా అనిరుద్ కి వరుస అవకాశాలు వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే దాదాపు అంతమంది స్టార్ హీరోలతో పనిచేసిన ఘనత అనిరుద్ కి దక్కింది. ప్రస్తుతం అనిరుద్ ఒక సినిమాకి సంగీతం చేస్తున్నాడు అంటేనే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. అనిరుద్ సంగీతానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది.

ఇక తెలుగులో కూడా అజ్ఞాతవాసి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ ను చవిచూసింది. కానీ ఈ సినిమాకు మాత్రం మంచి మ్యూజిక్ అందించాడు అనిరుద్. ఇప్పటికీ కూడా ఈ సినిమా పాటలు వినసొంపుగా అనిపిస్తాయి. ఆ తర్వాత జెర్సీ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా అనిరుద్ దేవర సినిమా కూడా సంగీతం అందించాడు. ఈ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కొరటాల శివ చేసిన నాలుగు సినిమాలుకు సంగీతం అందించాడు దేవిశ్రీప్రసాద్. అలానే వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా అందుకున్నాడు దర్శకుడు కొరటాల. ఇక ఆచార్య సినిమాకి మొదటిసారి మణిశర్మ తో పనిచేశాడు. అలానే దేవరా సినిమాకి మొదటిసారి అనిరుద్ తో పనిచేశాడు.

Advertisement

అయితే చాలా పెద్ద తెలుగు సినిమాలకి సంగీత దర్శకుడుగా అనిరుద్ ను తీసుకోవాలని ట్విట్టర్లో ట్రెండ్ జరుగుతూ ఉంటుంది. ఈ విషయంపై సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్పందించారు. అలా జరగడం అనేది చాలా మంచి పరిణామం. అనిరుద్ ఇక్కడ తెలుగు సినిమాలు చేసినట్లు, నేను కూడా తమిళ్లో చాలా సినిమాలు చేశాను. అలానే హిందీ ఫిలిం ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేశాను. మనం అలా ఫీల్ అవ్వకూడదు సంగీతానికి భాషతో సంబంధం లేదు అంటూ దేవిశ్రీప్రసాద్ చెప్పుకొచ్చారు. దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, పుష్ప టు సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. పుష్ప సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక రీసెంట్ టైమ్స్ లో అనిరుద్ కి తెలుగులో కూడా మంచి అవకాశాలు వరుసగా వస్తున్నాయి అని చెప్పాలి. గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న మ్యాజిక్ అనే సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందించాడు. అలానే విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాకి కూడా అనిరుద్ సంగీతాన్ని అందించబోతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×