BigTV English
Advertisement

Students Bomb Threat School: స్కూల్‌లో బాంబు.. బెదిరించిన విద్యార్థులు.. పరీక్షలకు చదువుకోలేదు!

Students Bomb Threat School: స్కూల్‌లో బాంబు.. బెదిరించిన విద్యార్థులు.. పరీక్షలకు చదువుకోలేదు!

Students Bomb Threat School| ఢిల్లీ లో గత కొన్ని నెలలుగా ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఈ బెదిరింపులు వచ్చిన ప్రతీసారి పిల్లలను స్కూల్ నుంచి బయటికి పంపేయడం .. ఆ తరువాత స్కూల్ కు యజమాన్యం సెలవు ప్రకటింస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ లోని రోహిణి ప్రాంతంలో చాలా స్కూళ్లకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపులు ఎవరు చేశారని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విచారణ చేయగా.. షాకింగ్ నిజాలు తెలిశాయి. స్కూల్ లో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్స్ వచ్చాయి. ఆ ఈ మెయిల్స్ పంపింది.. ఆ స్కూల్ విద్యార్థులేనని పోలీసులు విచారణలో తేలింది.


దీనిపై ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటన కూడా జారీ చేశారు. “కొన్ని రోజుల క్రితం రోహిణిలోని రెండు ప్రైవేట్ స్కూళ్లలో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు ఈ బెదిరింపు ఈ మెయిల్స్ కేసు విచారణ పూర్తి చేశారు. ఆ ఈ మెయిల్స్ పంపినవారు అదే స్కూల్ కు చెందిన విద్యార్థులేనని విచారణలో తేలింది. ఇదంతా ఇద్దరు విద్యార్థులు చేశారు. ఆ ఇద్దరు విద్యార్థులు స్కూల్ లో పరీక్షల కోసం చదువుకోలేదు. ఫరీక్షల్లో ఫెయిల్ అవుతామనే భయంతో వారు బాంబులు ఉన్నట్లు స్కూల్ కు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నాం. ఆ తరువాత కౌన్సెలింగ్ ఇచ్చి విడుదల చేశాం ” అని ఢిల్లీ పోలీస్ ప్రకటనలో పేర్కొంది.

బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చిన రెండు స్కూళ్లు రోహిణి ప్రాంతంలో ఉన్నాయి. వాటిలో ఒకటి వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్ ఉంది. రోహిణి ప్రశాంత్ విహార్ పివిఆర్ మల్టీప్రెక్స్ లో నవంబర్ 28న ఒక బాంబు పేలింది. ఈ ఘటన జరిగిన తరువాత అదే ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్ లో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్ ద్వారా బెదిరించారు.


Also Read: శోభనం రాత్రి గంజాయి, మటన్ కావాలన్న పెళ్లికూతురు.. ఆమె ఆడది కాదన్న అనుమానంతో వరుడు!

అదే ప్రాంతంలోని మరో స్కూల్ లో కూడా ఇలాగే బాంబు ఉన్నట్లు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. ఇవి రెండు వేర్వేరు ఘటనలు. రెండు ఘటనల్లో కూడా విద్యార్థులే దోషులని పోలీసులు తేల్చారు. బాంబు బెదిరింపులు రావడంతో స్కూల్ లో తనిఖీలు చేయడానికి రెండు రోజుల సెలవులు ఇచ్చారు.

బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ పంపిన విద్యార్థులు.. కౌన్సెలింగ్ సమయంతో తామే ఆ ఈ- మెయిల్స్ పంపినట్లు అంగీకరించారు. గత కొంత కాలంగా ఢిల్లీ లో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తుండడంతో తమకు ఈ ఐడియా వచ్చిందని చెప్పారు. అయితే పోలీసులు వారి తల్లిదండ్రులను హెచ్చిరించి విద్యార్థులను విడుదల చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో గత 11 రోజుల్లో అనూహ్యంగా 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బెదిరింపు ఈమెయిల్స్ ద్వారానే వస్తున్నాయి. పోలీసులు ఈ మెయిల్స్ ట్రాక్ చేయకుండా దుండగలు విపిఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్) ఉపయోగించి ఈ మెయిల్స్ పంపిస్తున్నారు. ఈ సంవత్సరం మే నెల నుంచి ఢిల్లీలోని స్కూళ్లు, ఆస్పత్రులు, ఎయిర్ పోర్టులు, విమాన కంపెనీలకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకూ ఈ బెదిరింపులు ఎవరు చేస్తున్నారనేది పోలీసులు కనిపెట్టలేకపోయారు.

Related News

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Big Stories

×