Dhanush: ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరో కైనా ఒక ఫేవరెట్ డైరెక్టర్ ఉంటాడు. ఎన్ని మంచి సినిమాలు తీసినా తన ఫేవరెట్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయాలని కలలు కంటూ ఉంటాడు. అలాగే ప్రతి ఒక్క డైరెక్టర్ కు ఒక కల ఉంటుంది. తమ అభిమాన హీరోతో ఒక సినిమా చేయాలని ఆశ ఉంటుంది. అది ఎప్పుడు ఎప్పుడు నెరవేరుతుందా అని కలలు కంటూ ఉంటాడు. అదే విషయాన్ని ఎన్ని సార్లు చెప్పమన్నా చెప్తూ ఉంటాడు. ఆ కల నెరవేరేంతవరకు కృషి చేస్తూనే ఉంటాడు.
తాజాగా ఒక హీరోకు మరో హీరోను డైరెక్ట్ చేయాలి అనే ఆశ ఎప్పటినుంచో ఉందని తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. తమిళ్ లో మంచి మంచి విజయాలను అందుకున్న ధనుష్ తెలుగులో సార్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ ఇప్పుడు కుబేర సినిమాతో మరో హిట్ ను అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ రెండు సినిమాల కన్నా ముందే ధనుష్ తెలుగు వారికి సుపరిచితుడు. ధనుష్ డబ్బింగ్ చిత్రాలు తెలుగులో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఇక ధనుష్ కేవలం హీరో మాత్రమే కాదు ఆయన మల్టీ టాలెంటెడ్. సినిమాకు సంబంధించి 24 క్రాఫ్ట్ ఉంటే అన్నింటిలోనూ ప్రావీణ్యం పొందిన నటుడు ధనుష్ అని చెప్పొచ్చు. హీరో, డైరెక్టర్, సింగర్ , మ్యూజిక్ కంపోజర్, డాన్సర్, రైటర్ ఇలా ప్రతి దాంట్లోనూ ధనుష్ తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం తెలుగులో కుబేర సినిమా చేస్తున్న ఈ హీరో గత రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఇప్పటికే మంచి సినిమాలకు దర్శకత్వం వహించిన ధనుష్ తెలుగులో కనుక ఒక హీరోను డైరెక్ట్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు అన్న ప్రశ్నకు అసలు తడుముకోకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. మొదటినుంచి ధనుష్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూలో ధనుష్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.
సార్ ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ ఇష్టమని స్టేజ్ మీదనే చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈ వార్త విన్న పవన్ ఫ్యాన్స్ ధనుష్ తో సినిమా చేయాలని పవన్ ను కోరుతున్నారు. ఏది ఏమైనా ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరో తో సినిమా చేయాలని ఆశగా ఉందని చెప్పడం తెలుగువారికి ఎంతో గర్వంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ధనుష్ కోరికను పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడా..? ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈ కాంబో సెట్స్ పైకి వెళుతుందా అనేది తెలియాల్సి ఉంది.