BigTV English
Advertisement

Raayan: ధనుష్ స్పీడ్ మాములుగా లేదు.. రాయన్ ఫస్ట్ సింగిల్ వచ్చేది ఎప్పుడంటే.. ?

Raayan: ధనుష్ స్పీడ్ మాములుగా లేదు.. రాయన్ ఫస్ట్ సింగిల్ వచ్చేది ఎప్పుడంటే.. ?

Raayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే తెలుగులో కుబేర చేస్తున్నాడు.. ఇది కాకుండా రాయన్ చిత్రాన్ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రానికి ధనుషే దర్శకత్వం వహించడం విశేషం. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, దునిషా విజయన్, సందీప్ కిషన్, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే రాయన్ రిలీజ్ డేట్ కూడా మేకర్స్ ప్రకటించారు.


జూన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా రాయన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. మే 9 న మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక పోస్టర్ లో ధనుష్ సిమెంట్ ఇటుకలపై కూర్చొని.. ఒక క్రూరమైన చూపుతో.. నవ్వుతున్నట్లు చూపించారు. వెనుక బ్యాక్ గ్రౌండ్ లో రావణుడు పది తలల బొమ్మను చూపించి హైలైట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లో పోస్టర్ లా కనిపిస్తుంది. చుట్టూ జనాలు కొట్టుకుంటుంటే.. ధనుష్ అలా చూస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే రావణుడుతో రాయన్ ను పోల్చినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు మరో హైలైట్ AR రెహమాన్ మ్యూజిక్. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు మ్యూజిక్ పరంగా మంచి హిట్ ను అందుకున్నాయి. ఈ సినిమాపై కూడా అభిమానులు అంతే ఆశలు పెట్టుకున్నారు. గతేడాది వచ్చిన ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కుబేర కన్నా ముందే రాయన్ వస్తుంది కాబట్టి.. కచ్చితంగా ధనుష్ హిట్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇది హిట్ అయితేనే కుబేరపై మరిన్ని అంచనాలు పెరుగుతాయి. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×