Kuberaa : ఈ సినిమాలో బెగ్గర్ రోల్ కోసం చాలా రీసెర్చ్ చేశాను
కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే మంచి టాలెంటెడ్ నటుల పేర్లు ప్రస్తావన వస్తే మొదటి వరుసలో వినిపించే పేరు ధనుష్. త్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు ధనుష్. ఈ సినిమా రావడానికి అంటే ముందు ఈ సినిమాలోని కొలవెరి పాట బాగా పాపులర్ అయింది. ఈ పాట పాపులర్ రావడంతో సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఊహించిన స్థాయిలో ఈ సినిమా సక్సెస్ సాధించలేకపోయింది. రఘువరన్ బీటెక్ సినిమా తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ధనుష్ తమిళ్ లో చేసిన ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చింది. ఇక డైరెక్టుగా తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి చేతులు కలిపాడు ధనుష్. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసిన సార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
కుబేర తో ప్రేక్షకులు ముందుకు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. డాలర్ డ్రీమ్స్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శేఖర్ తన కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా చాలామంది మీద ప్రభావం చూపించింది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాతో మొదటిసారి ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు శేఖర్. ఈ సినిమాలో ధనుష్ బెగ్గర్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ రోల్ కోసం ధనుష్ చాలా కష్టపడ్డాడట. అంతేకాకుండా పర్సనల్ గా కూడా వాళ్ళు ఎలా ఉంటారు అని రీసెర్చ్ కూడా చేశాడు. ఒక పాత్ర కోసం ధనుష్ ఎంతలా కష్టపడతాడు ముందు సినిమాలు ఇదివరకే ప్రూవ్ చేశాయి.
15 ఏళ్ల కల నెరవేరింది
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ సార్ హీరోల్లో నాగార్జున ఒకరు. నాగార్జున కెరియర్లో శివ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు శివ సినిమా తన కెరీర్ లో ఎంత ప్రత్యేకంగా పేరు సాధించిపెట్టిందో కుబేర కూడా దాదాపు అలాంటిదే అని తెలిపారు. దాదాపు 15 ఏళ్ల నుండి శేఖర్ కమ్ములతో సినిమా చేయాలి అని నాగర్జున అనుకున్నారట అది మొత్తానికి నేటితో నెరవేరింది. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా రెండు పాటలు పెండింగ్ లో ఉన్నట్టు రీసెంట్ గా ఇంటర్వ్యూలో నిర్మాత తెలిపారు. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో నాగార్జున టాలెంట్ తెలియనుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలి సినిమాలో కూడా నాగార్జున ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు.