Indian Army: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ ఆర్మీ నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన వెకెన్సీ, విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం, కోర్సు, శిక్షణ గురించి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
2026 జనవరిలో ప్రారంభమయ్యే 54వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను కోరుతుంది. ఎంపికైనవారికి బీటెక్ కోర్సు, లెఫ్టినెంట్ కొలువులకు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 12లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం వెకెన్సీలు: 90
కోర్సు: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 54వ కోర్సు – 2026 జనవరి
విద్యార్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60% మార్కులతో ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ (మెయిన్స్) 2025లో పాసై ఉంటే సరిపోతుంది. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 12
వయస్సు: 2026 జనవరి 1 నాటికి 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య వయస్సు ఉంటే సరిపోతుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్స్) స్కోరు, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
కోర్సు, శిక్షణ: మొత్తం నాలుగేళ్ల కోర్సు ఉంటుంది. ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఇందులో ఏడాది పాటు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, మూడేళ్లు టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజినీరింగ్ (బీఈ/ బీటెక్) డిగ్రీ అందజేస్తారు.
స్టైఫండ్: సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ ఉంటుంది. మూడేళ్ల శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు.
ALSO READ: SSC Notification: గోల్డెన్ ఛాన్స్.. ఇంటర్, డిగ్రీ అర్హతతో 14,582 ఉద్యోగాలు.. డోంట్ మిస్
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
వెకెన్సీలు: 90
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 12