BigTV English

Dhanush: కోలీవుడ్‌లో మరో ‘కేజీఎఫ్’.. హిట్ కాంబోతో రిస్క్ తీసుకోనున్న ధనుష్..

Dhanush: కోలీవుడ్‌లో మరో ‘కేజీఎఫ్’.. హిట్ కాంబోతో రిస్క్ తీసుకోనున్న ధనుష్..

Dhanush: మామూలుగా ఒక డైరెక్టర్, హీరో కాంబినేషన్ ఎంత హిట్ అయినా కూడా అదే మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. వారికి ఉన్న కమిట్మెంట్స్ వల్ల మళ్లీ వారి కాంబో కలిసి పనిచేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇలాంటి ఒక అసాధారణమైన విషయాన్ని ప్రాక్టికల్ చేసి చూపించాడు ధనుష్. తనతో కలిసి ఇప్పటివరకు నాలుగు హిట్ సినిమాలు చేసిన దర్శకుడికే అయిదోసారి అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. వెట్రిమారన్. త్వరలోనే ధనుష్ (Dhanush), వెట్రిమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా గురించి అప్పుడే సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


సూర్యతో సినిమా

ఇటీవల ‘విడుదల 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెట్రిమారన్. రెండేళ్ల క్రితం విడుదలయిన ‘విడుదల’కు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నా ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయాడు ఈ దర్శకుడు. దాంతో వెట్రిమారన్ విషయంలో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అందుకే తన తరువాతి సినిమాతో ఎలాగైనా అందరినీ ఇంప్రెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం తను సూర్యతో కలిసి ‘వాడివాసల్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కాగా.. దీని తర్వాత తను ధనుష్‌తో మూవీ చేయనున్నాడని బయటికొచ్చింది.


Also Read: ‘కూలీ’ కథను మలుపు తిప్పనున్న నాగార్జున.. స్టోరీ మొత్తం లీక్ అయ్యిందిగా.!

లాభాల కోసమే

సూర్యతో వెట్రిమారన్ (Vetrimaaran) తెరకెక్కించే ‘వాడివాసల్’ గురించి ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎంతోకాలంగా ఈ మూవీ గురించి కోలీవుడ్‌లో చర్చలు నడుస్తుండగా ఫైనల్‌గా ఇది సెట్స్‌పైకి వెళ్లే సమయం వచ్చేసింది. ఇక ‘వాడివాసల్’ తర్వాత ధనుష్‌తో వెట్రిమారన్ సినిమా ఉంటుందని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అయిన ఆర్ఎస్ ఇన్ఫొటైన్మెంట్ ప్రకటించింది. ‘విడుదల 2’ ఫ్లాప్ అవ్వడం వల్ల దానికి తగిన లాభాలు రావాలంటే ధనుష్, వెట్రిమారన్ కలిస్తేనే సాధ్యమని ఆర్ఎస్ ఇన్ఫొటైన్మెంట్ భావించిందని, అందుకే ఈ కాంబినేషన్ సెట్ చేసిందని సమాచారం. ఈ మూవీ కేజీఎఫ్ గోల్డ్ ఫీల్డ్స్ ఆధారంగా తెరకెక్కనుందట.

అదే స్టోరీ

కేజీఎఫ్ గోల్డ్ ఫీల్డ్స్‌పై ఇటీవల విక్రమ్ కూడా ఒక సినిమాను తెరకెక్కించాడు. అదే ‘తంగలాన్’. ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి డిశాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి అదే కథాంశంతో ధనుష్, వెట్రిమారన్ మూవీ తెరకెక్కించడం అనేది రిస్క్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ ఈ కాంబోపై ఉన్న నమ్మకంతో కచ్చితంగా ఈ మూవీ కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా.. ఇందులో ఎన్‌టీఆర్ ఒక గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడనే వార్త కూడా బయటికొచ్చింది. మొత్తానికి ధనుష్, వెట్రిమారన్ కాంబోలో తెరకెక్కే అయిదో సినిమా కోసం ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడం కోసం మేకర్స్ ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. సూర్యతో చేసే ‘వాడివాసల్’ రిజల్ట్ కూడా ధనుష్‌తో చేసే సినిమా రిజల్ట్‌పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×