Gautam Gambhir: టీమిండియా ( Team India) ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) కెరీర్ ప్రమాదంలో పడింది. దీనికి కారణంగా టీమిండియా ఆటతీరే. టీమిండియా ప్లేయర్లు దారుణంగా విఫలం కావడం కారణంగా టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కొంపమునిగేలా కనిపిస్తోంది. ఇక ఇది ఇలాగే కొనసాగితే..టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పదవి కోల్పోవడం గ్యారెంటీ అని నివేదికలు చెబుతున్నాయి. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలోనే.. ఈ మధ్య కాలంలో టీమిండియా వరుసగా టెస్ట్ సిరీస్ లను కోల్పోయింది. న్యూజిలాండ్ తో స్వదేశంలో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది.
Also Read: Tilak Varma – Vijay Devarkonda: టాలీవుడ్ హీరోతో తిలక్ వర్మ.. విదేశాల్లో చిల్ !
ఇక ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ( Border Gavaskar Trophy ) ఆస్ట్రేలియాతో ( Australia ) జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) ఉద్యోగం ప్రమాదంలో పడిందని తెలుస్తోంది. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 19, 2025 నుంచి ప్రారంభమయ్యే ICC ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శన ఆధారంగా టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) పదవి ఆధారపడి ఉంటుందట. ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ( ICC Champions Trophy 2025 ) టీమిండియా అట్టర్ ఫ్లాఫ్ అయితే… గంభీర్ పోస్ట్ పోవడం గ్యారెంటీ అన్న మాట.
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా గొడవలు జరుగుతున్నాయని… లోపల జరిగిన విషయాలు బయటకు వస్తున్నాయని… కూడా వార్తలు వస్తున్నాయి. దానికి కారణం గంభీర్ అని బీసీసీఐ ఓ అంచనాకు వచ్చిందట. ఇలాంటి నేపథ్యంలోనే… బీసీసీఐ కీలక నిర్ణయానికి వచ్చిందట. ఫిబ్రవరి 19, 2025 నుంచి ప్రారంభమయ్యే ICC ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శన బాగా లేకపోతే.. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ను ( Gautam Gambhir ) ఇంటికి పంపడం గ్యారెంటీ అంటున్నారు బీసీసీఐ అధికారులు. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో టీమిండియాకు కొత్త కోచ్ ను కూడా తెచ్చేందుకు రెడీ అయిందట. దీంతో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) కెరీర్ ప్రమాదంలో పడింది.
Also Read: Bumrah vs Jaiswal: కెప్టెన్సీ కోసం కొట్టుకుంటున్న బుమ్రా, జైశ్వాల్ ?
టీమిండియా కోచ్‌గా గంభీర్..ఫలితాలు దారుణంగా ఉన్నాయి. గంభీర్ కోచ్‌గా ( Gautam Gambhir ) బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత జట్టు 10 టెస్టుల్లో ఆరింటిలో సక్సెస్ అయింది. అలాగే, 2024లో, శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో టీమిండియా ఓడింది. రాహుల్ ద్రవిడ్ దిగిపోయిన తర్వాత టీమిండియా చెత్తగా ఆడుతోందట. 2024 జూలైలో గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, టీమ్ ఇండియా ప్రదర్శన దారుణంగా తయారైంది. కోచ్ గౌతమ్ గంభీర్…తీసుకుంటున్న నిర్ణయాల వల్లే.. ఈ పరిస్థితి ఉందట. టీమిండియాలో సూపర్ స్టార్ సంస్కృతి తీసుకువచ్చి… జట్టును నాశనం చేస్తున్నాడని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారట.