Coolie: ఒకే సినిమాలో ఎంతోమంది స్టార్ హీరోలను, సీనియర్ యాక్టర్లను హ్యాండిల్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు.. అలాంటిది ఒక యంగ్ డైరెక్టర్ దీనిని సక్సెస్ చేసి చూపించాడు. తనే లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). కోలీవుడ్‌లో లోకేశ్ కనకరాజ్‌కు దర్శకుడిగా ఉన్న సినిమాల అనుభవం కొంచమే అయినా అంతలోనే తనపై ప్రేక్షకుల్లో విపరీతమైన నమ్మకం క్రియేట్ అయ్యేలా చేశాడు. అందుకే లోకేశ్ సినిమా అంటే కచ్చితంగా అందరికీ నచ్చుతుందని, మినిమమ్ గ్యారెంటీ హిట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు లోకేశ్ కనకరాజ్ అప్‌కమింగ్ మూవీ ‘కూలీ’ గురించి ఒక ఆసక్తికర విషయం బయటికొచ్చింది. అందులో నాగార్జున పాత్ర ఇదేనంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.
వీడియో లీక్
‘కూలీ’ సినిమాను భారీ క్యాస్టింగ్‌తో ప్రారంభించాడు లోకేశ్ కనకరాజ్. ఇందులో హీరో రజినీకాంత్ అయినా కూడా తెలుగు సీనియర్ హీరో అయిన నాగార్జున కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు. కన్నడ సీనియర్ హీరో అయిన ఉపేంద్ర కూడా ఈ మూవీలో భాగమయ్యారు. అలా క్యాస్టింగ్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాడు లోకేశ్. గత కొంతకాలంగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదే సమయంలో నాగార్జున షూటింగ్‌కు సంబంధించిన ఒక మేజర్ పార్ట్ లీక్ అయ్యింది. అప్పుడే మేకర్స్ భారీగా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు ‘కూలీ’లో నాగార్జున పాత్ర ఇదేనంటూ ఒక కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: అక్కినేని పెద్ద కోడలి మొదటి సంక్రాంతి.. అవి లేకుండానా ఛీఛీ.. ?
ఫ్లాష్‌బ్యాక్‌లో మాత్రమే
‘కూలీ’ (Coolie) సినిమా గోల్డ్ స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని ముందుగానే రివీల్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాలో కింగ్ మేకర్ పాత్రలో నాగార్జున కనిపించనున్నట్టు సమాచారం. ఆయన పాత్ర ఇందులో చాలా కీలకం అని తెలుస్తోంది. రజినీకాంత్ (Rajinikanth), నాగార్జున మధ్య వచ్చే సీన్స్ ‘కూలీ’ సినిమాలో హైలెట్‌గా నిలవనున్నాయి. కానీ ఈ మూవీలో ఫ్లాష్‌బ్యాక్ వరకే నాగ్ పాత్ర పరిమితం కానుందనే విషయం బయటికొచ్చింది. గతంలో నాగార్జున (Nagrjuna), వర్తమానంలో ఉపేంద్ర.. ఒకే టైప్ పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. నాగార్జున షూటింగ్‌కు సంబంధించిన వీడియో లీక్ అయినప్పుడే అది కథలో చాలా కీలకమైన సీన్ అని ప్రకటించాడు లోకేశ్ కనకరాజ్.
స్టార్ క్యాస్టింగ్
మొత్తానికి ఒక స్టార్ క్యాస్టింగ్‌తో ‘కూలీ’పై అంచనాలు భారీగా పెంచేశాడు లోకేశ్ కనకరాజ్. రజినీకాంత్, ఉపేంద్ర, నాగార్జునతో పాటు ఈ మూవీలో మరికొందరు క్రేజీ యాక్టర్లు ఉన్నారు. ఇందులో శృతి హాసన్ లీడ్ రోల్‌లో నటించనుంది. తన పాత్ర కూడా కథతో ఎన్నో మలుపులు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని సమాచారం. ఇక ‘మంజుమ్మెల్ బాయ్స్’తో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, తమిళ నటుడు సత్యరాజ్ కూడా ఈ సినిమా నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. మే లేదా ఆగస్ట్‌లో ‘కూలీ’ని ఎలాగైనా విడుదల చేయాలని నిర్ణయించుకున్న మేకర్స్.. షూటింగ్‌కు అస్సలు బ్రేక్ ఇవ్వకుండా కొనసాగిస్తున్నారు.