Ajith – Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush ) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే . బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిట్ అవుతూ.. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే.. మరొకవైపు దర్శకత్వం చేస్తూ టైం అంతా సినిమా షూటింగ్ సెట్ లోనే గడిపేస్తున్నారు. తెలుగులో కుబేర (Kubera) సినిమా చేస్తున్న ఈయన.. తమిళంలో ఇడ్లీ కడాయ్ (Idlee Kadai), బాలీవుడ్ లో తేరీ ఇష్క్ మే(Theri Ishk Me) వంటి చిత్రాలు చేస్తున్నారు. రాయన్ (Rayan ) సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన.. ఈ చిత్రంలో నటించడమే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఇక ఇప్పుడు ఈయన నుండి రాబోతున్న చిత్రం ఇడ్లీ కడాయ్. ఈ చిత్రానికి కూడా ఈయనే దర్శకత్వం వహిస్తున్నారు.
రేస్ నుండి ధనుష్ తప్పుకున్నట్టేనా..?
ఇకపోతే నేషనల్ అవార్డు గ్రహీత నిత్యామీనన్ (Nithya Menon) ధనుష్ తో మళ్ళీ ఇందులో జోడి కడుతోంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా అజిత్ (Ajith ) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేసి ఇప్పుడు ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. దీంతో ఆ రోజున బాక్సాఫీస్ వద్ద వార్ తప్పేలా లేదు అంటూ అటు సినీ వర్గాలలో కూడా ఆందోళన మొదలయ్యింది. ఎందుకంటే ఏప్రిల్ 10వ తేదీన ఇడ్లీ కడాయ్ సినిమా విడుదల చేస్తున్నామంటూ ప్రకటించగా.. ఇప్పుడు అజిత్ మూవీ కూడా అదే రోజు విడుదల చేయబోతున్నారని తెలియడంతో అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రేస్ నుంచి ధనుష్ కాస్త వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
అజిత్ కి ధనుష్ భయపడ్డారా.?
ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నుండి విడుదలైన టీజర్ కోలీవుడ్ రికార్డులను తిరగరాసి సినిమాపై ఊహించని బజ్ పెంచేసింది. ఇలాంటి చిత్రంతో పోటీ ఎందుకులే అని ధనుష్ తప్పుకున్నాడు అని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇడ్లీ కడాయ్ సినిమాలో ఇంకా కొన్ని సన్నివేశాలు తీయాల్సి ఉందని, అందుకే అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయలేము కాబట్టి సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక అందులో భాగంగానే ఆగస్టు లేదా సెప్టెంబర్ చివరి నాటికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే వచ్చే వినాయక చవితికి లేదా దసరాకు ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదాపై అజిత్ తో తలపడితే తనకే రిస్క్ అని,అజిత్ ను ఢీ కొట్టడం కంటే సింపుల్ గా తప్పుకోవడం బెటర్ అని ధనుష్ భావిస్తున్నాడు అంటూ కోలీవుడ్ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. మరి ఏది ఏమైనా సైలెంట్ గా రేస్ నుండి ధనుష్ తప్పుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది.