Blackpink: మామూలుగా ఫారిన్ సినిమాల నుండి, ఫారిన్ మ్యూజిక్ నుండి ఇండియన్ మేకర్స్ కాపీ కొడతారు అంటూ తరచుగా ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. అలాగే ఫారిన్ మేకర్స్ కూడా ఇండియన్ సినిమాల నుండి కాపీ కొడతారనే విషయం మీకు తెలుసా.? అలా కాపీ కొట్టినా కూడా ఇలాంటి విషయాలు పెద్దగా బయటపడలేదు. తాజాగా ఒక కొరియన్ పాపులర్ బ్యాండ్ ఏకంగా హిందీ పాటను కాపీ కొట్టి దొరికిపోయింది. మామూలుగా కొరియన్ సింగర్స్‌కు, కొరియన్ పాప్ బ్యాండ్స్‌కు ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న బ్యాండ్స్‌లో బ్లాక్‌పింక్ కూడా ఒకటి. తాజాగా ఆ బ్యాండ్‌లో సింగర్ చేసిన తప్పును నెటిజన్లు ఇట్టే కనిపెట్టేశారు.
కాపీ కొట్టారు
కొరియన్ పాప్ బ్యాండ్ అయిన బ్లాక్‌పింక్‌లో ఒక సింగర్ అయిన జెన్నీ తాజాగా ఒక పాటను విడుదల చేసింది. అది విడుదల చేసిన వెంటనే ఇది బాలీవుడ్ మూవీ ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’లోని మ్యూజిక్ లాగా ఉందే అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. కొందరు అయితే ఆ మ్యూజిక్, ఈ మ్యూజిక్‌ను పక్కపక్కనే పెట్టి ఎడిట్స్ చేసి.. డౌట్ లేదని ఇది సేమ్ మ్యూజిక్ అని ఫిక్స్ అయిపోయారు. అలా ఒక నెటిజన్ చేసిన ఎడిట్ ట్విటర్‌లో పోస్ట్ చేయగా దానిని చూసిన ప్రేక్షకులు సైతం నిజంగా ఒకటే మ్యూజిక్ లాగా ఉందే అని ఫీలవుతున్నారు. అలా కొరియన్ బ్యాండ్స్ కూడా బాలీవుడ్ మ్యూజిక్‌ను కాపీ కొడతాయంటూ ఇండియన్ మూవీ లవర్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు.
కావాలని చేయలేదా.?
కరణ్ జోహార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రమే ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’. ఈ మూవీలో రాణీ పాత్రలో ఆలియా భట్ ఇంట్రడక్షన్‌కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. చీరకట్టులో ఏంజెల్‌లాగా నడిచొస్తూ ఒక యాటిట్యూడ్ మెయింటేయిన్ చేస్తుంది ఆలియా. ఆ యాటిట్యూడ్‌కే ప్రేక్షకులు ఫిదా అవుతారు. ఇక ఆ ఇంట్రడక్షన్ సమయంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌నే జెన్సీ తన పాటలో ఉపయోగించింది. శ్రద్ధగా వింటే రెండు ట్యూన్స్ ఒకటే అనిపించేలా ఉంది. అయితే కొరియన్ బ్యాండ్స్‌కు ఇండియాకు కూడా క్రేజ్ ఎక్కువ కాబట్టి జెన్నీ కావాలని అలా చేసి ఉండదని, అదేదో పొరపాటు అయ్యిండొచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read: రొమాన్స్ చేయడానికి హీరోలు సిద్ధంగా లేరు.. డైరెక్టర్ షాకింగ్ స్టేట్‌మెంట్
మ్యూజిక్ డైరెక్టర్‌కు క్రెడిట్స్
‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani) సినిమాకు ప్రీతమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. అయితే బ్లాక్‌పింక్ (Blackpink) బ్యాండ్.. ఈ మ్యూజిక్‌ను కాపీ చేసి కూడా ఆయనకు కనీసం క్రెడిట్ ఇవ్వలేదని మరికొందరు బాలీవుడ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా.. 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో తెరకెక్కింది కాబట్టి ఈ మూవీని బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు.. సౌత్ ఆడియన్స్ కూడా ఆదరించారు.
#BLACKPINK's Jennie copied the song 'Rani Anthem' from the movie 'Rocky Aur Rani Ki Prem Kahani', which has Indian artist Pritam's credits, in a way that sounds no different. pic.twitter.com/lwtiCS2O7m
— K-Pop Base (@kpopbaseee) March 4, 2025