Dhop Song:రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్(RRR ) సినిమా చేసిన తర్వాత రామ్ చరణ్ (Ram Charan) రేంజ్ ఒక్కసారిగా గ్లోబల్ స్థాయిలో పాకిపోయింది.. దాంతో గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు రామ్ చరణ్..ఇక ప్రస్తుతం ఎస్.శంకర్ (S.Shankar) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. భారీ అంచనాల మధ్య జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం..
ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలలో వేగం పెంచింది.. అందులో భాగంగానే డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. మరొకవైపు ఆంధ్రాలో కూడా మరొక ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. అంతేకాదు ఈనెల 29వ తేదీన 250 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇక మరొకవైపు ఈ సినిమాలలోని పాటలను వరుసగా విడుదల చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన “రా మచ్చా మచ్చా” , “నా నా హైరానా” పాటలకు ఊహించని రెస్పాన్స్ లభించింది.
జానీ మాస్టర్ కంపోజ్ లో దోప్ పాట విడుదల..
ఇప్పుడు ఈ సినిమా నుండి మరో పాట “దోప్” ను కూడా విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్, కియారా అద్వానీ డాన్సింగ్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ముగ్ధులవుతున్నారు. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకత్వంలో తమన్, రోషిని, పృథ్వీ , శృతి రంజని పాడారు. ఈ పాటను జానీ మాస్టర్ కంపోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఇక వీరిద్దరూ కూడా తమ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా కియారా అద్వానీలో జోష్ ఏమాత్రం తగ్గలేదని, మరొకసారి నిరూపణ అయింది. ఇందులో రామ్ చరణ్ లుక్కుకి అమ్మాయిలు సైతం ఫిదా అవుతున్నారు.
రాంచరణ్ తదుపరిచిత్రాలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా తరువాత ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది. ఇక మరొకవైపు బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు సమాచారం. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. అందుకే ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది. ఏది ఏమైనా రాంచరణ్ మాత్రం వరుస సినిమాలు ప్రకటిస్తూ స్టార్ స్టేటస్ ను అందుకుంటూ బిజీగా మారిపోయారుఇక ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్, తన పెట్ డాగ్ రైమ్ తో సహా మైనపు విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.