Game Changer Movie : శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. శంకర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు శంకర్. పేరుకు తమిళ్ దర్శకుడైన కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. శంకర్ చేసిన ప్రతి సినిమా తెలుగులో అప్పట్లో డబ్బింగ్ అవుతూ వచ్చేవి. ఇక శంకర్ మొదటిసారి తెలుగులో దర్శకుడుగా ఒక సినిమాను చేస్తున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ రోల్ లో కనిపిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 21న యు.ఎస్‌లోని డల్లాస్‌లో గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ లెవల్లో నిర్వహించారు.
ఇప్పటివరకు గేమ్ చేంజర్ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా థమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవ్వనుంది అని చెప్పాలి. ఇప్పటివరకు రిలీజ్ అయిన మూడు పాటలు కూడా అద్భుతమైన హిట్ అయ్యాయి. రీసెంట్ గా ఈ సినిమా నుంచి దోప్ అనే నాలుగో పాటను కూడా రిలీజ్ చేశారు. ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ తరుణంలో సినిమా గురించి పలు అంశాలను పంచుకున్నాడు శంకర్. అంతేకాకుండా తాను చాలా మంది హీరోలతో పనిచేయాలని కోరుకుంటున్నట్లు తన స్పీచ్ లో చెప్పాడు. కరోనా టైంలో ప్రభాస్ తో కూడా స్టోరీ డిస్కషన్ జరిగినట్లు రివిల్ చేశాడు.
ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా గురించి శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక ప్రభుత్వ అధికారికి ఒక ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ కి మధ్య కథ అని రివిల్ చేశాడు. శంకర్ నుంచి ఇటువంటి కథలు ఉన్న సినిమాలు రావడం అనేది కామన్ గా జరుగుతుంది. కానీ కార్తీక్ సుబ్బరాజు ఈ కథ రాయడం అనేది ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఈ కథ శంకర్ రేంజ్ లో ఉండటం వలన తన అసిస్టెంట్ డైరెక్టర్ తో డిస్కస్ చేసి ఈ కథను శంకర్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని అప్పగించారు కార్తీక్. అయితే ఈ కథను పవన్ కళ్యాణ్ హీరోగా చేద్దామని ఫిక్స్ అయ్యారు శంకర్ కానీ కొన్ని కారణాల వలన అది కాస్త రామ్ చరణ్ చేతికి వెళ్ళింది.
Also Read : SKN – Lucky Baskhar : లక్కీ భాస్కర్ కలెక్షన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నిర్మాత.. ఏమైందంటే..?