Allu Arjun Arrests : అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ అభిమానులు ఉంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆర్మీ ఉంది. తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు సాధించుకున్న అల్లు అర్జున్ పుష్ప
సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించుకున్నాడు. ఇక రీసెంట్ గా విడుదలైన పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అతి త్వరగా వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఐదున రిలీజ్ అవ్వడానికంటే ముందు నాలుగో తారీఖు రాత్రి నుంచి ప్రీమియర్ షోస్ వేశారు. హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు ఈ సినిమాను చూడడానికి వచ్చారు.
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వచ్చినప్పుడు జరిగిన విషాద ఘటన అందరికీ తెలిసిన విషయమే. ఈ ఘటనలో రేవతి అనే ఒక ఆమె మృతి చెందింది. ఆ మృతికి చిత్ర యూనిట్ కూడా సంతాపం తెలిపారు. అలానే 25 లక్షల రూపాయల సొమ్మును నష్టపరిహారంగా ఆ కుటుంబానికి అందజేస్తామని కూడా అధికారికంగా ప్రకటించారు. లేకపోతే ఈ వ్యవహారం చిన్నది కాదు. ఒక కుటుంబం సఫర్ అవుతుంది అని అంటే జీవితాంతం ఆ గిల్టు అనేది ఉండిపోతుంది. ఈ ఘటనలో భాగంగా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం అరెస్టు కాదని కేవలం ఎంక్వైరీ నిమిత్తం మాత్రమే అల్లు అర్జున్ ని పిలుస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. సినీనటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అల్లుఅర్జున్‌ను ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు.
Also Read : Mounika : జర్నలిస్ట్ ను పరామర్శకు హాస్పటిల్ కు వెళ్తున్న మనోజ్ భార్య
గతంలో పోలీసులు మాట్లాడుతూ కూడా అల్లు అర్జున్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సినిమా చూడటానికి వచ్చారు అని చెప్పారు. అయితే అల్లు అర్జున్ చేసిన మైనస్ పాయింట్ ఇది అని ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ సినిమాకు వచ్చినట్లయితే థియేటర్ యాజమాన్యానికైనా చెప్పి ఉంటే బాగుండేది. అల్లు అర్జున్ వస్తున్నాడు అని ముందుగానే చెప్తే ఎక్కువ క్రౌడ్ ఇంకా వచ్చేస్తారు. ఎటు చూసినా కూడా ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఈ విషాదం జరిగింది. ఇక అల్లు అర్జున్ పైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.