BigTV English

BB Telugu 8: భద్రత పెంచిన నిర్వాహకులు.. బలగాలతో మాత్రం కాదండోయ్..!

BB Telugu 8: భద్రత పెంచిన నిర్వాహకులు.. బలగాలతో మాత్రం కాదండోయ్..!

Bigg Boss 8.. బిగ్ బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ 8 డిసెంబర్ 15వ తేదీన ఆదివారం చాలా గ్రాండ్ గా ఫినాలే నిర్వహించనున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. దాదాపు 15 రోజుల పాటు హౌస్ లో పోరాడి తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, ఒక గౌరవాన్ని, ప్రత్యేకతను కూడా చాటుకున్నారు. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి టాస్క్ లు ఆడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న నిఖిల్ (Nikhil), మరొకవైపు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చినా కూడా తన పర్ఫామెన్స్ తో మెప్పించిన గౌతమ్(Gautham) ఇద్దరు కూడా టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఇక ఇద్దరిలో ఎవరికి టైటిల్ ఇవ్వబోతున్నారు అనేది నరాలు తెగేంత ఉత్కంఠగా మారింది.


ఇకపోతే ఈసారి బిగ్ బాస్ రేసులో గెలిచిన వారికి.. చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా టైటిల్ తోపాటు ప్రైజ్ మనీ చెక్ కూడా అందిస్తున్నారు. ఇకపోతే గత సీజన్లో ముఖ్యఅతిథిగా ఎవరూ రాలేదు. హోస్టుగా వ్యవహరించిన నాగార్జున చేతుల మీద గానే పల్లవి ప్రశాంతికి ట్రోఫీ అందించారు. అయితే ఈ సీజన్లో మాత్రం తప్పకుండా సెలబ్రెటీని తీసుకురావాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పేరు ప్రథమంగా వినిపిస్తోంది. తాజాగా పుష్ప 2 సినిమా విజయోత్సవాలలో ఉన్నారు బన్నీ. ఇప్పటికే ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయింది. ఇక ఈయన బిగ్ బాస్ ఫైనల్లో గెస్ట్ గా వస్తే మరింత క్రేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతోనే మేకర్స్ బన్నీని చీఫ్ గెస్ట్ గా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు బన్నీ ముఖ్య అతిథిగా వస్తే అన్నపూర్ణ స్టూడియో వద్ద జనం భారీగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. దీనికి తోడు గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గొడవలకు, అల్లర్లకు తావు ఇవ్వకుండా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు హైదరాబాద్ పోలీసులు.. ఇకపోతే అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాలలో బిగ్ బాస్ సెట్టింగ్ వేయగా.. ఫైనల్ కూడా ఇక్కడే జరగబోతోంది.. గత సీజన్లో జరిగిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


అందులో భాగంగానే అన్నపూర్ణ స్టూడియో చుట్టూ దాదాపు 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పోలీసులు, ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియోకి, అలాగే బిగ్ బాస్ యాజమాన్యానికి అందజేశారట. ఇక ఫైనల్ రోజుకు ముందే అంటే 104వ రోజు అనగా డిసెంబర్ 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని కూడా పోలీసులు సూచించారట. మొత్తానికైతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కి బలగాలతో కాకుండా సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేయనున్నారు నిర్వాహకులు. ఏది ఏమైనా సీజన్7 దెబ్బకు భయపడిపోయిన వీరు ముందస్తు జాగ్రత్తగా ఇలా చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×