Bhuma Mounika : ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు గురించి తెలిసిన విషయమే. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇవే వీడియోలు కనిపిస్తున్నాయి. టీవీ డిబేట్స్ లో కూడా ఇదే చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు విష్ణు వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకునే స్థాయి వరకు వచ్చేసారు. ఈ తరుణంలో ఈ న్యూస్ కవర్ చేసే పనిలో పడ్డారు చాలామంది జర్నలిస్టులు. రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి సంబంధించిన ఒక జర్నలిస్ట్ మోహన్ బాబుని అడిగే ప్రయత్నంలో మోహన్ బాబు ఆవేశంతో మైకుల లాక్కుని అతనిపై దాడి చేశారు. దీంతో ఆయన ఆస్పత్రి పాలు అయ్యాడు.
ఇక్కడితో ఈ వివాదం మరింత పెరిగింది. ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్న ఆ ప్రముఖ జర్నలిస్టును మంచు మనోజ్ భార్య భూమ మౌనిక పరామర్శించబోతున్నట్లు సమాచారం వస్తుంది. ఇందు నిమిత్తం ఆమె యశోద హాస్పిటల్ కి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే మోహన్ బాబు మాట్లాడుతూ ఈ విషయం పై కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే నేను అప్పటికి చాలా సంస్కారంగా నమస్కారం పెడుతూ వస్తున్నాను. ఈ తరుణంలో నా మీదకు వచ్చి మైక్ పెట్టారు. ఒకవేళ మైక్ నాకు తగిలి ఉంటే నేను హాస్పిటల్ పాలు అయ్యే వాడిని. నాకు ఎవరి మీద కోపం లేదు. వాస్తవానికి అది ఒక ప్రముఖ ఛానల్ అని కూడా నాకు తెలియదు. నా మీదకు వచ్చిన మైక్ ను మాత్రమే నేను తీసుకున్నాను. అంతేకాకుండా ఆ ఛానల్ కి సంబంధించిన ప్రతినిధితో పలు సందర్భాల్లో నేను కూడా మాట్లాడాను అంటూ తనదైన క్లారిటీ ఇచ్చారు మోహన్ బాబు.
జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేయడంని కొందరు వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు మాత్రం సోషల్ మీడియా వేదికగా మంచు మోహన్ బాబుకి ఎలివేషన్ ఇస్తున్నారు. ఇన్నాళ్లు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. టీవీ జర్నలిస్టుల మీద దాడి చేసిన వాడిని ఎవరైనా చూశారా.? అది మోహన్ బాబు చేశాడు అంటూ రంగస్థలం రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు.
భూమ మౌనిక యశోద హాస్పిటల్ కి వెళ్లడం వెనక కూడా తీవ్రమైన చర్చలకు దారితీసే అవకాశం ఉంది. మోహన్ బాబు కొడితే ఈమె పరామర్శించడం వలన సానుభూతి వస్తుంది అని ఆలోచనలో ఉన్నారు. అనేది కొంతమంది అభిప్రాయం. మరి దీనిపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి అసలు ఈ వివాదం ఎప్పటికీ సద్దుమనుకుతుందో ఒక క్లారిటీ లేకుండా పోయింది. అంతేకాకుండా కొన్ని మీడియా ఛానల్స్ మాత్రం ఈ వివాదం ఆల్మోస్ట్ సద్దుమణిగిపోయింది. ఇంక గొడవలు లేవు అంటూ వార్తలు కూడా ప్రచురిస్తుంది.
Also Read : Ram Charan: యాంటీ ఫ్యాన్స్ డ్యూటీ ఎక్కారు, అయ్యప్ప మాలలో ఆ మాటలు ఏంటయ్యా అంటూ రామ్ చరణ్ ను ట్రోలింగ్