BigTV English

Bandla Ganesh : బండ్ల గణేష్ హాట్ కామెంట్స్, ఆ ప్రొడ్యూసర్ నే అంటున్నారా.?

Bandla Ganesh : బండ్ల గణేష్ హాట్ కామెంట్స్, ఆ ప్రొడ్యూసర్ నే అంటున్నారా.?

Bandla Ganesh : నటుడుగా కెరియర్ మొదలుపెట్టి ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించుకున్నాడు కమెడియన్ బండ్ల గణేష్. కమెడియన్ గా ఉన్న బండ్ల గణేష్ ఒక్కసారిగా నిర్మాతగా మారిపోయాడు. బండ్ల గణేష్ నిర్మాతగా మారడం వెనకాల పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు బినామీగా ఉన్నాడంటూ అప్పట్లో తక విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నిటికీ కూడా తన వాక్చాతుర్యంతో పదునైన మాటలతో సమాధానం చెప్పాడు బండ్ల గణేష్. బండ్ల గణేష్ నిర్మాతగా ఆంజనేయులు అనే సినిమాను నిర్మించాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా కూడా ఊహించిన సక్సెస్ ఇవ్వలేదు. ఇక నిర్మాతగా పని అయిపోయింది అనుకునే టైంలో అద్భుతమైన కం బ్యాక్ ఇచ్చాడు గణేష్.


గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ 

బండ్ల గణేష్ అంటే అందరికీ గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ సినిమాను బండ్ల గణేష్ నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందు బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ ఆడియో లంచ్ లో మాట్లాడిన మాటలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా అంటే బండ్ల గణేష్ స్పీచ్ మాత్రం బీభత్సమైన వైరల్ అవుతుంది. ఒకవేళ ఆ సినిమా ఈవెంట్ కి బండ్ల గణేష్ రాకపోయినా కూడా అది ఒక హాట్ టాపిక్ అవుతుంది. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమాని అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా పెద్ద పెద్ద దేవుళ్ళతో పోల్చి మరి పవన్ కళ్యాణ్ కు తను ఎంత భక్తుడునో చెప్పుకొచ్చాడు.


ఆ ప్రొడ్యూసర్ టార్గెట్ చేశాడా.?

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ తరుణంలో థియేటర్లు బంద్ పిలుపునిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ను నలుగురు నిర్మాతలు టార్గెట్ చేశారంటూ సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టు మరి క్లారిటీ ఇచ్చారు. ఈ తరుణంలో బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. ఆస్కార్ నటులు కమల్ హాసన్లు ఎక్కువైపోయారు అంటూ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ చేయటం అనేది హాట్ టాపిక్ గా మారింది. కేవలం దిల్ రాజును ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×