BigTV English

Tdp Mahanadu: మహానాడుకి రెండు అడ్డంకులు..

Tdp Mahanadu: మహానాడుకి రెండు అడ్డంకులు..

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరగబోతున్న మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ అట్టహాసంగా నిర్వహించబోతోంది. అందులోనూ లోకేష్ కి కీలక పదవిని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ టైమ్ లో మహానాడుకి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. మొదటిది తుపాన్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. మూడు రోజులపాటు జరిగే మహానాడుకి భారీ వర్షాలు పెద్ద అడ్డంకిగా మారబోతున్నాయి. రెండోది కరోనా. ఏపీలో కరోనా కేసులు లేవు, కడపలో అసలే లేవని ప్రభుత్వం చెబుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం కరోనా ఉంటే మహానాడు ఆ రేంజ్ లో ఎలా పెడతారంటూ నిలదీస్తున్నారు. రేపు ఏపీలో కరోనా కేసులు ఏమాత్రం పెరిగినా, మహానాడుకి వెళ్లొచ్చిన వారిలో ఏ ఒక్కరికి కొవిడ్ సోకినా.. వైసీపీ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ రెండిటి విషయంలో టీడీపీ నేతలు కూడా కాస్త టెన్షన్ పడుతున్నారు.


కడప గడ్డపై మహానాడు..
మహానాడు అంటేనే టీడీపీ నేతలకు, కార్యకర్తలకు పెద్ద పండగ. మహానాడు నిర్వహణ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఏ పార్టీ కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని అంత అట్టహాసంగా నిర్వహించలేదు అనే రేంజ్ లో మహానాడు నిర్వహణకు కష్టపడతారు నేతలు. ఈ ఏడాది పార్టీ అధికారంలోకి వచ్చింది. అందులోనూ వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ సంతోష సమయంలో మరింత అట్టహాసంగా మహానాడు నిర్వహించబోతున్నాడు. దీనికోసం అక్కడా ఇక్కడా ఎందుకంటూ జగన్ ఇలాకా కడపనే వేదికగా ఎంచుకున్నారు. కడప గడ్డపైనుంచి మహానాడు గర్జన వినిపించాలనుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ, సరిగ్గా మహానాడు జరిగే మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి కూడా. నైరుతి రుతుపవనాలకు, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కూడా జతైంది. దీంతో వర్షాలు భారీగా కురుస్తాయని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో మహానాడు నిర్వహణ కాస్త కష్టంతో కూడుకున్న పనే. అయినా సరే ఏర్పాట్లకు ఏమాత్రం లోటు లేకుండా చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలనుకుంటున్నారు. కానీ వర్షం అడ్డు వస్తే మాత్రం ఎన్ని ఏర్పాట్లు చేసినా కష్టమేనని తెలుస్తోంది. ఈనెల 27తో మొదలై మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో చివరి రోజు మరింత ప్రత్యేకత ఉంటుంది. కనీసం ఆ రోజయినా వర్షం తెరిపిస్తే బాగుంటుందని అంటున్నారు టీడీపీ నేతలు.

కరోనా భయం


కరోనా విషయంలో టీడీపీ నేతలకు పెద్ద టెన్షన్ లేదు కానీ.. వైసీపీ మాత్రం ఈపాటికే రచ్చ చేస్తోంది. కడపలో కరోనా కేసులున్నాయని, అయినా మహానాడు కోసం కూటమి ప్రభుత్వం ఆ కేసుల్ని దాచిపెడుతోందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఏకంగా కడప జిల్లా అధికారుల్ని కలసి మహానాడు ఏర్పాట్లపై ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్న వేళ, ఏపీలో ఇలాంటి భారీ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి కూటమి ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదనే చెప్పాలి. ప్రస్తుతానికి ఏపీలో కరోనా కేసులు లేవని చెబుతున్నా.. రేపు మహానాడు తర్వాత కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగితే అందరూ టీడీపీని విమర్శిస్తారు. ప్రస్తుతానికి కేసులు లేవు కాబట్టి, కరోనాని టీడీపీ నేతలు లెక్కలోకి తీసుకోవడంలేదు. కరోనా కంటే ఎక్కువగా వారిని వర్షాలు భయపెడుతున్నాయనే మాట మాత్రం వాస్తవం.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×