BigTV English
Advertisement

Khushi Kapoor: అన్నతో అక్క ఎంట్రీ.. తమ్ముడితో చెల్లి ఎంట్రీనా.. బావుందయ్యా ?

Khushi Kapoor: అన్నతో అక్క ఎంట్రీ.. తమ్ముడితో చెల్లి ఎంట్రీనా.. బావుందయ్యా ?

Khushi Kapoor: అన్నా .. అక్కా.. తమ్ముడు.. చెల్లి ఏంటి.. అర్ధం పర్థం లేకుండా ఉంది అని అనుకుంటున్నారా.. ? అసలు మ్యాటర్ ఏంటి అంటే.. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న ఎంట్రీ ఏదైనా ఉంది అంటే అది నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజదే.


నందమూరి నట సింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ అదుగో అప్పుడు వస్తాడు.. ఇప్పుడు వస్తాడు అని చెప్పడమే తప్ప.. ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యిందే లేదు. ఒకసారి లుక్ ప్రాబ్లమ్ అని, ఇంకోసారి డైరెక్టర్ ప్రాబ్లమ్ అని.. ఇలా కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం అవేమి లేవు. మోక్షు ఎంట్రీ ఈ ఏడాది ఉండబోతుందని బల్లగుద్ది చెప్పుకొస్తున్నారు టాలీవుడ్ వర్గాలు.

అందుతున్న సమాచారం ప్రకారం హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ వర్మ.. మోక్షు తెరంగేట్రం బాధ్యతలను భుజాన వేసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా అయిపోయిందని, ఇంకోపక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుందని సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞకు జోడిగా శ్రీదేవి చిన్న కూతురు, జాన్వీ కపూర్ చెల్లి ఖుషీ కపూర్ ను అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.


ఇక ఇదే విషయాన్నీ ప్రశాంత్ వర్మ, బాలయ్య వద్దకు తీసుకెళ్లాడని, ఆయన కూడా సముఖతను వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఇప్పటికే జాన్వీ.. ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఇప్పుడు ఇది కనుక ఓకే అయితే.. ఖుషీ, మోక్షజ్ఞతో ఎంట్రీ ఇస్తుంది. అంటే అన్నతో అక్క ఎంట్రీ.. తమ్ముడితో చెల్లి ఎంట్రీ అన్నమాట.

ఇక ఖుషీ ఇప్పటికే బాలీవుడ్ లో ది ఆర్చీస్ అనే సిరీస్ తో ఎంట్రీ ఇచ్చింది. అక్క అంత కాకపోయినా.. అమ్మడు కూడా అందగత్తె. మోక్షజ్ఞకు సరిజోడే. మరి నందమూరి వారసులతో కపూర్ వారసులు ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×