BigTV English

Siddarth -Aditi Rao Hydari: మరీ ఇంత మోసమా… కాస్త ఆలోచించాల్సింది లవ్ బర్డ్స్

Siddarth -Aditi Rao Hydari: మరీ ఇంత మోసమా… కాస్త ఆలోచించాల్సింది లవ్ బర్డ్స్

Siddarth -Aditi Rao Hydari:  బాలీవుడ్ ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ  ఈరోజు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెల్సిందే. తన ప్రియుడు సిద్దార్థ్ తో తన పెళ్లి అయినట్లు ఈరోజు అధికారికంగా ప్రకటించింది.  గత కొన్నేళ్లుగా అదితి, హీరో సిద్దార్థ్ రిలేషన్ లో ఉంటున్న విషయం తెల్సిందే.  మహాసముద్రం సినిమాలో సిద్దార్థ్, అదితి జంటగా కనిపించారు. అప్పటి నుంచి వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.  ఆ ప్రేమ.. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.


అయితే అందుతున్న సమాచారం ప్రకారం వీరి పెళ్లి 2 నెలల క్రితమే  జరిగిందని తెలుస్తోంది. మార్చి లోనే ఈ జంట సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.  తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరి నిశ్చితార్థం ఎంతో సీక్రెట్ గా జరిగింది. ఒక సినిమా కోసం అని చెప్పి ఆలయంలో  ఈ తంతు పూర్తిచేశారని అప్పట్లో వార్తకు కూడా వచ్చాయి. ఇక ఈ విషయాన్నీ కూడా సిద్దు రెండు మూడు రోజుల తరువాత  అభిమానులకు అధికారికంగా తెలిపాడు.

సరే.. ఎంగేజ్ మెంట్ సీక్రెట్ గా చేసుకున్నారు కదా.. పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేసుకుంటారు అని ఒకపక్క మీడియా..  ఇంకోపక్క  అభిమానులు వీరి వివాహ ప్రకటన  కోసం ఎంతగానో ఎదురుచూసారు. ఇక ఈసారి కూడా ఈ జంట అభిమానులను నిరుత్సాహపరిచింది. సీక్రెట్ గా రెండు నెలల  క్రితమే వివాహం చేసుకొని.. ఆ విషయం బయటకు  రావడంతో చేసేది లేక  నేడు తమ పెళ్లి జరిగినట్లు ఫోటోలను షేర్ చేశారని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ,  ఇది చాలా  మోసం అదితి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


రెండు నెలల  క్రితం పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ఫోటోలు పెడితే మాత్రం .. ఇప్పుడే పెళ్లి చేసుకున్నట్లు  అవుతుందా.. ? ఆ మాత్రం ఆలోచన లేదా.. ? జనాలను అలా మోసం చేయాలనుకుంటున్నారా.. ? అంటూ  ఏకిపారేస్తున్నారు.  ఇంకొంతమంది మాత్రం ఎప్పుడు పెళ్లి చేసుకుంటే ఏముంది కానీ, లైఫ్ మొత్తం విడిపోకుండా సంతోషంగా  ఉండండి అని చెప్పుకొస్తున్నారు.

ఇక వీరి కెరీర్ల విషయానికొస్తే.. ప్రస్తుతం సిద్దు.. చిన్నా లాంటి హిట్ అందుకున్నాక ఫామ్ లోకి వచ్చాడు.  ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అదితి సైతం బాలీవుడ్ లో హీరామండీ తరువాత మంచి సినిమాలు చేస్తూ వస్తుంది. మరి ఈ జంట భవిష్యత్తులో తెరపై మళ్లీ కనిపిస్తారేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×