Hero Rajinikanth Assets:తలైవా.. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) గురించి, ఆయన యాక్టింగ్ పర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బెంగళూరులో ఒక సాధారణ బస్ కండక్టర్గా పని చేసిన శివాజీ రావు గైక్వాడ్(Shivaji Rao Gaikwad) నేరు సూపర్ స్టార్ గా ఎదిగారు. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన ఈయన బాలచందర్ (Balachandar)దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగల్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కెరియర్ ప్రారంభంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన.. ‘భైరవి’ అనే సినిమాతో హీరోగా మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాలో రజనీకాంత్ స్టైల్ అందరికీ నచ్చింది. దాంతో అభిమానుల సంఖ్య కూడా పెరిగింది. నల్లగా ఉంటే సినిమాల్లో రాణించలేరు అనే అపోహను రజనీకాంత్ పటాపంచలు చేశారు. తన స్టైల్, నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. బాక్సాఫీస్ కింగ్ అయిపోయారు. రజనీకాంత్ తమిళ్, తెలుగు, హిందీ అని తేడా లేకుండా ప్రతిభాషలో కూడా మంచి డిమాండ్ ఏర్పరుచుకున్నారు.
జపాన్ లో కూడా భారీ క్రేజ్..
ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన ఒక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు జపాన్ లో కూడా సూపర్ స్టార్ గానే పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా ఈయన నటించిన ‘ముత్తు’ సినిమా జపాన్లో సూపర్ హీరోని చేసేసింది. 20 ఏళ్లకు పైగా అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ సినిమా.. ఈరోజు రజనీకాంత్ పుట్టినరోజు. ఆయన 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికీ కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన రజినీకాంత్, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల జాబితాలో చేరిపోయారు.
రూ.250 కోట్ల పారితోషకం.. రూ.450 కోట్ల ప్రాపర్టీ..
గత ఏడాది ‘జైలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన, ఈ సినిమాకి ఏకంగా రూ.250 కోట్ల పారితోషకం అందుకున్నారు. అంతేకాదు కోలీవుడ్లో హీరో విజయ్ (Vijay)తర్వాత అంత పారితోషకం తీసుకున్న నటుడిగా రజనీకాంత్ పేరు దక్కించుకున్నారు. ఇకపోతే ఈయన మొత్తం ఆస్తులు విలువ ఎంత అనే విషయానికొస్తే.. సుమారుగా రూ.450 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. చెన్నై పోయెస్ గార్డెన్ లో అత్యంత విలాసవంతమైన బంగ్లా రజనీకాంత్ సొంతం. దీని ధర రూ.35 కోట్లు. అంతేకాదు చెన్నైలో ఒక కళ్యాణ మండపం కూడా ఉంది. దీని విలువ సుమారుగా రూ.20 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక బిఎండబ్ల్యూ, ఆడి, వంటి కార్లతో పాటు రూ.6కోట్ల విలువైన బెంట్లీ లుమినస్ , లంబోర్గిని ఉరస్ మెర్సిడెస్ బెంజ్ జి వ్యాగన్ వంటి లగ్జరీ కార్లు కూడా ఈయన కార్ గ్యారేజ్ లో ఉన్నాయి.. ఇక ఈయనకు ఇద్దరూ కూతుర్లే కావడం గమనార్హం. ఇకపోతే ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నా సరే సాధారణ జీవితాన్ని గడపడానికే రజనీకాంత్ ఇష్టపడతారు. ఇదే ఆయనకు అభిమానులను మరింత దగ్గర చేసింది. ఇకపోతే ఈరోజు రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.