Pushpa 2 trailer : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో పుష్ప సినిమా ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉన్న చాలా కాంబినేషన్స్ లో వీరిద్దరి కాంబినేషన్ పై మంచి హైప్ ఉంది. ఆర్య సినిమాతో మొదలైన వీళ్ళ పరిచయం ఇప్పటివరకు సక్సెస్ఫుల్ గా కొనసాగింది. అల్లు అర్జున్ ఎంతమంది దర్శకులతో పనిచేసిన కూడా తనకు ఎప్పటికీ ఇష్టమైన డైరెక్టర్ అంటే సుక్కు అని చెబుతాడు. పుష్ప సినిమా సక్సెస్ మీట్ లో కూడా సుకుమార్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు అల్లు అర్జున్. పరుగు సినిమా తర్వాత నాకు ఇష్టమైన కారు కొనుక్కున్నాను. ఇంతవరకు నేను రావడానికి ఎవరు కారణం అని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఫస్ట్ కనిపించిన వ్యక్తి సుకుమార్. డార్లింగ్ నువ్వు లేకపోతే నేను లేను అని ఆన్ స్టేజ్ పై సుకుమార్ గురించి చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.
పుష్ప సినిమా తర్వాత వీరిద్దరి రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో తెలిసింది. ఈ సినిమాలోని డైలాగ్స్ ని చాలామంది ప్రముఖులు విపరీతంగా వాడటం వలన సినిమా ఇంకా పాపులర్ అయింది. ఇక ప్రస్తుతం సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది ఈ సందర్భంగా ట్రైలర్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ ఈవెంట్ పాట్నాలో జరపనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి దర్శకుడు సుకుమార్ హాజరవ్వడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాకి సంబంధించిన పనులను హైదరాబాద్ లో ఉండి చేయించనున్నారు సుకుమార్.
Also Read : Sandeep Reddy Vanga: బాహుబలి లాంటి సినిమా ట్రై చేస్తా
సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్య సినిమాతో కెరీర్ ను మొదలు పెట్టిన సుకుమార్ అతి తక్కువ టైంలోనే దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. సుకుమార్ సినిమాలు మిగతా దర్శకులు కంటే కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. రాజమౌళి లాంటి దర్శకులు కూడా నాకు అసలైన పోటీ సుకుమార్ అంటూ ఒక సందర్భంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సుకుమార్ సినిమాల్లో హీరోలు చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తారు. అలానే సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పుష్ప సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ లు డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమా గురించి టాపిక్ వినిపిస్తూనే ఉంది. ఇదివరకే పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.