Google Docs AI Generated Images : Googleలో ఇకపై రియలిస్టిక్ ఫోటోస్ ను క్రియేట్ చేయటం మరింత తేలిక. తన కస్టమర్స్ కోసం తాజాగా ఇమేజెన్ 3 మోడల్ ( Imagen 3 model) ను అందుబాటులోకి తీసుకొచ్చింది సెర్చ్ ఇంజన్. ఈ ఫీచర్ ను ఉపయోగించడంతో జెమిని నేరుగా Google డాక్స్‌లో హై క్వాలిటీ, ఫోటోరియలిస్టిక్ ఫోటోలను అందిస్తుందని తెలిపింది. ఈ తాజా కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని గూగుల్ ప్రకటించింది. యాడ్ ఆన్‌లతో Google Workspace కస్టమర్‌లకు ఇమేజ్ జనరేషన్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది.
Google డాక్స్ (Google Docs) –
గూగుల్ (Google ) అధునాతనంగా తీసుకొచ్చిన జెమిని AI మోడల్‌తో ఆధారితమైన Google డాక్స్‌లో కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ తో Google డాక్స్‌లో ఫుల్ క్లారిటీ ఇమేజెస్ తో పాటు Google స్లయిడ్‌లలో AI రూపొందించిన ఫోటోలను మరింత సృజనాత్మకంగా అందుస్తుందని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్ ను ఉపయోగించి మునుపటి కంటే బెస్ట్ క్వాలిటీతో వ్యక్తులు, ప్రకృతి దృశ్యాలు, మరిన్ని ఫోటోరియలిస్టిక్ చిత్రాలు సృష్టించే అవకాశం ఉందని గూగుల్ ఓ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
ఇక Google తీసుకొచ్చిన తాజా ఇమేజెన్ 3 మోడల్‌ను ఉపయోగించడం ద్వారా జెమిని నేరుగా Google డాక్స్‌లో హై క్వాలిటీ, ఫోటోరియలిస్టిక్ చిత్రాలను క్రియోట్ చేయగిలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ టెక్స్ట్ టు ఇమేజ్ AI మోడల్ వినియోగదారులకు బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది.
గూగుల్ డాక్స్ (Google Docs)లో AI చిత్రాలను ఎలా సృష్టించాలంటే –
ఇన్‌లైన్ ఫోటోలను క్రియేట్ చేయాలన్నా లేక మీరే సొంతంగా ఫోటోలను క్రియేట్ చేయాలన్నా కావలసిన ప్రాంప్ట్‌ను టైప్ చేయవచ్చు. కొన్నిసార్లు డాక్స్‌లోని జెమిని మీరిచ్చే సూచనల ఆధారంగా ఫోటోలను రూపొందిస్తుంది. ఇమేజ్ ఉండాల్సిన సైజ్ ను ఎంచుకోవచ్చు. ఇందులో ఫోటోగ్రఫీకి సంబంధించిన సూచనలు ఇవ్వవచ్చు. ఉదాహరణకు వాటర్ కలర్, చుట్టూ ఉండే బ్యాక్ గ్రౌండ్ ను ఎంచుకునే అవకాశం ఉందని గూగుల్ తెలిపింది.
ఈ డాక్స్‌లో జెమినితో ఇమేజెస్ ను క్రియేట్ చేయటానికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరంలేదని… విభిన్నమైన ఇమేజెస్ ను సృష్టించటానికి ఈ ఫీచర్ ప్రతీ ఒక్కరికీ సహకరిస్తుందని గూగుల్ తెలిపింది. ఈ యాడ్ ఆన్‌లతో Google Workspace కస్టమర్‌లకు ఇమేజ్ జనరేషన్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది. Gemini Business, Gemini Enterprise, Gemini Education, Gemini Education Premiumతో పాటు Google One AI ప్రీమియం వినియోగదారులు ఈ ఫీచర్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇక ఈ ఫీచర్ ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది కాబట్టి క్రమక్రమంగా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపిన గూగుల్… కనిష్టంగా 15 రోజులు తర్వాత అందరికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పుకొచ్చింది.
ALSO READ : ఈ పాస్‌వర్డ్స్ హ్యాకర్స్ కు బహిరంగ ఆహ్వానం – మీరూ ఈ జాబితాలో ఉంటే వెంటనే మార్చేయండి!