BigTV English

Game Changer Release Update: దిల్ రాజ్ తాజా ప్రకటన.. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడంటే..?

Game Changer Release Update: దిల్ రాజ్ తాజా ప్రకటన.. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడంటే..?

Game Changer Release Update: రామ్ చరణ్ కథా నాయకుడిగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అంటూ సినీ ప్రియులు, చరణ్ ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులు ఆ విషయమై అడుగగా నిర్మాత దిల్ రాజ్ స్పందిస్తూ.. క్రిస్మస్‌కు కలుద్దామంటూ పేర్కొన్నారు. దీంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్‌తోపాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న శంకర్.. ఇటీవలే విడుదలైన భారతీయుడు 2 సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.

దీంతో గేమ్ ఛేంజర్ మూవీ ఇప్పుడు విడుదల కాకపోవొచ్చు.. ఇంకాస్త టైం పట్టొచ్చు అనుకున్నారు అభిమానులు. అయితే, భారతీయుడు 2 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న డైరెక్టర్ శంకర్‌ను గేమ్ ఛేంజర్ ఎప్పుడు విడుదల చేస్తున్నారంటూ విలేకర్లు అడుగగా.. ఫైనల్ ఎడిటింగ్ అయ్యాక విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. ఈలోగా నిర్మాత దిల్ రాజ్ సర్‌ప్రైజ్ ఇచ్చేశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.


Also Read: బిగ్ బాస్ సీజన్ – 8 ప్రోమో.. ఎలా ఉందో చూశారా..?

ఇదిలా ఉంటే.. ‘నేను తీసిన తమిళ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. అందుకే నేరుగా తెలుగులోనే ఒక సినిమాను తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ క్రమంలో కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ సినిమాతో నా కల నెరవేరబోతోంది. ఇది పూర్తిస్థాయి యాక్షన్ మూవీ. ఇలాంటి మాస్ సినిమా తీసి చాలా రోజులవుతుంది’ అంటూ శంకర్ ఇటీవలే ఓ ఇంటర్వ్యుూలో పేర్కొన్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×