A.S. Ravi Kumar : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు ఏఎస్ రవికుమార్(ఆ.S.Ravi Kumar) మరణించిన విషయం తెలిసిందే. ఈయన మంగళవారం రాత్రి గుండెపోటు(Heart Attack) కారణంగా మరణించారనే విషయం తెలిసిన సినీ ప్రముఖులు అభిమానులు ఈయన మరణ వార్తపై దిగ్భ్రాంతి చెందుతూ సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక ఏ ఎస్ రవికుమార్ కెరియర్ విషయానికి వస్తే ఈయన బాలయ్య, గోపీచంద్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారని విషయం తెలిసిందే.
దర్శకుడిగా గుర్తింపు…
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఏఎస్ రవి కుమార్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో గోపీచంద్ (Gopi Chand)ను విలన్ నుంచి యజ్ఞం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమాకు మంచి గుర్తింపు రావడంతో వెంటనే బాలయ్యతో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. నందమూరి బాలకృష్ణతో ‘వీరభద్ర’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. కానీ ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. అలాగే మనసుతో, ఏం పిల్లా ఏం పిల్లడో, ఆటాడిస్తా, సౌక్యం, పిల్లా నువ్వు లేని జీవితం, తిరగబడరా సామీ వంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఈ విధంగా ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగుతున్న ఏఎస్ రవికుమార్ ఇటీవల కాలంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి కూడా కాస్త దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
జగడం…
గత కొద్దిరోజులుగా రవికుమార్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. కుటుంబంలో చోటు చేసుకున్న వ్యక్తిగత గొడవల కారణంగా ఇంటికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇలా వ్యక్తిగత కారణాలవల్ల కెరియర్ పై కూడా ఫోకస్ చేయలేకపోయారని సమాచారం. ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి కెరియర్ ఉన్న రవికుమార్ అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి . ఇక ఈయన దర్శకుడిగా మాత్రమే కాదండోయ్ ఓ సినిమాలో నటుడిగా కూడ నటించారని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం “జగడం”. ఈ సినిమా 2007 మార్చి 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాలో ఎంతోమందికి సెలబ్రిటీలు భాగమయ్యారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ కూడా ఈ సినిమాలో నటించారని తెలుస్తోంది. ఇందులో ఈయన ఒక చిన్న విలన్ పాత్రలో నటించారు. లడ్డు అనే విలన్ పాత్ర ద్వారా వెండితెరపై కూడా సందడి చేసిన రవికుమార్ తదుపరి ఎలాంటి సినిమాలలో నటించలేదు. ఇలా రవి కుమార్ మరణం తర్వాత ఈయన సినిమాలలో కూడా నటించారు అనే విషయం తెలిసే అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దర్శకుడిగా తెర వెనుక ఉంటూ స్టార్ హీరోలతో తెరపై అద్భుతాలు సృష్టించిన ఈయన అకాల మరణం పట్ల అభిమానులు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఈయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి అంటూ నివాళులు అర్పిస్తున్నారు.