BigTV English

Mangalavaram Movie : పబ్లిక్ గా ఉతికి ఆరేసిన..మంగళవారం మూవీ డైరెక్టర్

Mangalavaram Movie :  పబ్లిక్ గా ఉతికి ఆరేసిన..మంగళవారం మూవీ డైరెక్టర్
Mangalavaram Movie

Mangalavaram Movie : ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ గా తొలి సినిమా తోనే మంచి సక్సెస్ అందుకున్నాడు అజయ్ భూపతి. తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని నమోదు చేసి ఇప్పుడు మంగళవారం మూవీతో తన లక్కీ హీరోయిన్ పాయల్‌కి మరొకసారి బెస్ట్ మూవీ చేసే అవకాశం అందించాడు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మూవీ సక్సెస్ ప్రెస్ మీట్ సందర్భంగా శనివారం నాడు హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ అజయ్ భూపతి కొన్ని షాకింగ్ స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం అతని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..


ఒకపక్క సినిమాకి సపోర్ట్ చేసిన మీడియాకి ధన్యవాదాలు అంటూనే మూవీ గురించి నెగిటివ్ కామెంట్స్ రాసిన రివ్యూవర్స్‌ పై ఫైర్ అయ్యాడు. మేము మంగళవారం సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన టైం నుంచి.. ఇందులో ఆర్ఎక్స్ 100 వైబ్స్‌ కనిపిస్తూనే వచ్చాయి. ఏ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. మొదటి హీరోలేని సినిమా.. మంచి క్యారెక్టర్స్ మీద బేస్ అయిన మూవీ కదా అని.. కేవలం ఒక రెండు.. మూడు థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్ షోస్ కూడా వేసాము. అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మరొక 12 థియేటర్లలో షోస్ పెంచాము.

మూవీ విడుదలైన తర్వాత కూడా ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆర్ఎక్స్ 100 కంటే మూవీ బాగుంది అని చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి మరీ చెప్పారు. మ్యూజిక్ దగ్గర నుంచి టేకింగ్ వరకు.. కథ ,కథనం దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు.. ప్రతి విషయం కొత్తగా ఉంది..చాలా బాగుంది అని చెబుతున్నారు. ఈ మూవీ మ్యూజిక్ బాగా సెట్ అయ్యింది.. మరి ముఖ్యంగా ఇంటెన్స్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది అని చాలామంది అన్నారు. మీడియా నుంచి కూడా మాకు ఈ మూవీ గురించి పాజిటివ్ బజ్ బాగా జనరేట్ అయింది.


యూట్యూబ్ ,ట్విట్టర్.. లాంటి అన్ని సోషల్ ప్లాట్ఫార్మ్స్ లో మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. బాగా రాసారా?.. రాయలేదా ?అనే విషయాన్ని అటు ఉంచితే.. నేను ట్విస్టుల గురించి ఎటువంటి రిక్వెస్ట్ అయితే చేశానో. వాళ్లు దాన్ని పాటించారు. క్యారెక్టర్స్ రిలీజ్ చేయొద్దు అన్న నా రిక్వెస్ట్ మనించి పాత్రలు లీక్ చేయకుండా హైడ్ చేసిన రివ్యూవర్స్‌ అందరికీ నా థాంక్స్. కానీ కొంతమంది అన్ ప్రొఫెషనల్ వ్యక్తులు.. కేవలం ఫోన్ పట్టుకొని రోడ్డు మీద తిరిగే వాళ్ళు కొందరు ఉన్నారు. కాస్త కూడా సెన్స్ లేకుండా పేపర్ పట్టుకుని మొత్తం స్టోరీ చదివి వినిపిస్తున్నాడు.

మూవీ అనేది నచ్చడం, నచ్చకపోవడం ప్రేక్షకుల ఇష్టం కానీ.. కొంతైనా విలువలు పాటిస్తే ఎవరికైనా బాగుంటుంది. ఒకళ్ళిద్దరూ తప్పితే మిగిలిన అందరూ 

రివ్యూ రైటర్స్ సినిమా గురించి బాగా చెప్పారు. అలాంటి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ మూవీ కూడా అలా వచ్చింది ఇలా వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా ఆర్ఎక్స్ 100 ఎలాగైతే ఇప్పటికీ ఆడియన్స్ మనసుల్లో గుర్తు ఉండిపోయిందో మంగళవారం కూడా అదే విధంగా అందరి మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది అన్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×