Anil Ravipudi : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Anil Ravipudi) సక్సెస్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఈయన ఒకరు. ఇప్పటివరకు అనిల్ రావు పూడి చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ తో ప్రేక్షకులను పలకరించారు. సినిమా సక్సెస్ అయితే మళ్లీ అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోల నుంచి స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వరకు చాలామంది ఇండస్ట్రీలో ఓ సినిమా వస్తుందంటే లక్కీ సెంటిమెంట్‌ను మళ్లీ రిపీట్ చెయ్యాలని అనుకుంటారు. తనకు సెంటిమెంట్స్ ఉండవని చెప్తూనే.. కెరీర్ స్టార్టింగ్ నుంచి తను ఫాలో అవుతున్న ఏకైక సెంటిమెంట్ ఇదేనంటూ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ లీక్ చేశాడు.. అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ అంటూ లేని డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మొదటి సినిమా నుంచి నిన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి తర్వాత అలాంటి సక్సెస్ ని సొంతం చేసుకున్న డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది అనిల్ రావిపూడి అని చెప్పాలి. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమాకి ముందు వరకు కూడా అనిల్ రావిపూడి సక్సెస్ సెంటిమెంట్ ఏంటి అంటే ఏమీ లేదన్న సమాధానం వినిపించేది.. ఒకప్పుడు నా మైండ్ నా సక్సెస్ అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది.
Also Read : ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే..
డైరెక్టర్ అనిల్ రావిపూడి సెంటిమెంట్ ఏంటంటే.. ముందుగా కథని సిద్ధం చేసుకున్న తర్వాత హీరోని ఫైనల్ చేసుకుంటాడట. అలాగే ప్రతి సినిమా కథను మానుకోటలోనే రాసుకుంటానని వివరించాడు.. సినిమా ఫస్ట్ అఫ్ మొత్తం అక్కడ రాసుకొని ఆ తర్వాత వేరే ప్లేస్ నేచర్ కి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మిగతా స్టోరీని రాసుకుంటానని అనిల్ రావిపూడి సీక్రెట్ ని రివిల్ చేశారు. ఇప్పటివరకు టాలీవుడ్ సీనియర్ హీరోస్ బాలయ్య, వెంకీలకు ది బెస్ట్ హిట్ సినిమాలను ఇచ్చిన ఈ డైరెక్టర్ఇప్పుడు చిరంజీవి ( chiranjeevi) మూవీ స్క్రిప్ట్ కోసం మరోసారి మానుకోట వెళ్లాను అన్నాడు. రైటింగ్ పరంగానే కాదు.. స్క్రీన్ ప్రజెంట్ పరంగాను అనిల్ రావిపూడి ఆ లక్కీ సెంటిమెంట్‌ను ఫాలో అవుతాడు.. మొత్తానికి అనిల్ రావిపూడి తన సినిమా కథల్ని అలా పూర్తి చేస్తారు. చిరంజీవి తర్వాత మరోసారి బాలయ్య ( balayya ) తో సినిమా చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తారో చూడాలి.