Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కూడా తన మార్క్ ఏంటో నిరూపించుకున్నారు. సాధారణంగా ఓ రాజకీయ నాయకుడు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతూ గుర్తింపు పొందుతారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల పరంగా, రాజకీయాల పరంగా జాతీయస్థాయిలో ఎంతో మంచి ఆదరణ పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కొనసాగుతూ, రాజకీయాలలో కూడా సక్సెస్ అందుకొని నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు.
పవన్ మొదటి వివాహం…
ఇక పవన్ కళ్యాణ్ వృత్తి పరమైన జీవితం, రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో పలు సందర్భాలలో ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈయన తన మూడవ భార్య పిల్లలతో కలిసి ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నందిని (Nandini)అనే అమ్మాయి మెడలో పవన్ కళ్యాణ్ మూడుములు వేశారు. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదు.
డైరెక్టర్ గీతాకృష్ణ బంధువా….
పవన్ కళ్యాణ్ నందిని వివాహమైన కొద్ది నెలలకే నందినికి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ అనంతరం రేణు దేశాయ్ ను వివాహం చేసుకున్నారు. ఇక ఈమెకు ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత రేణు దేశాయ్ కు కూడా విడాకులు ఇచ్చి అన్నా లెజినోవా అనే మహిళను వివాహం చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రెండో భార్య మూడో భార్య ఇద్దరు కూడా ఇండస్ట్రీకి సంబంధం ఉన్నవారే. ఇక మొదటి భార్య నందిని ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని తెలుస్తోంది. తాజాగా ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ (Geetha Krishna)పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని గురించి ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.
పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని మాకు సమీప బంధువు అంటూ ఈయన షాకింగ్ ట్విస్ట్ బయట పెట్టారు. మా అక్కను పోలవరం ఇచ్చి పెళ్లి చేసాము. ఇక నందినిది కూడా పోలవరమే. మా అక్కకు వాళ్లు బంధువులు అవుతారు అక్కడ వాళ్ళవి చాలా పెద్ద కుటుంబాలు. ఇక పెళ్లి కాకముందు ఓసారి ఆ ప్రాంతంలో నాగార్జున సినిమా షూటింగ్ జరుగుతుండగా భారీ వర్షాలు పడ్డాయి, ఆ సమయంలో మేము నందిని వాళ్ళ ఇంట్లోనే ఉన్నామని గీతాకృష్ణ తెలిపారు. చిన్నప్పుడు తనని అందరూ చిన్ని.. చిన్ని అంటూ పిలిచేవారు. ఇక పెళ్లికి ముందు కూడా నందిని నేను ఒకసారి చూశాను తర్వాత మాకు తెలియకుండా పెళ్లి చేశారని గీతాకృష్ణ తెలిపారు.. నిజానికి వీరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. చాలా ఘనంగా చేస్తామని నందిని కుటుంబ సభ్యులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోవడంతోనే వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో షిరిడిలో జరిగిందని, మరోసారి వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు తన తండ్రి పెళ్లి ఆల్బమ్ చూపించారని గీతాకృష్ణ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.