BigTV English

NTR: ముఖంలో నవ్వు లేదు.. నీల్ కు ఎన్టీఆర్ తో సినిమా చేయడం ఇష్టం లేదా..?

NTR: ముఖంలో నవ్వు లేదు.. నీల్ కు ఎన్టీఆర్ తో సినిమా చేయడం ఇష్టం లేదా..?

NTR: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ నిజాలు ఏంటి.. ? అబద్దాలు ఏంటి.. ? అనేది వారి అంతరాత్మకు తప్ప బయట ఎవరికి తెలియదు. ఇండస్ట్రీలో పుకార్లు సర్వ సాధారణమే. సోషల్ మీడియా వచ్చాక.. ఈ పుకార్లు మరింత పెరిగాయి. ఇంకా చెప్పాలంటే.. ఊరు, పేరు తెలియనివాడు నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంటాడు.


ఇక హీరోల ఫ్యాన్ వార్స్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అని కొట్టుకుచేస్తున్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ 31 చేయబోతున్నాడు. కెజిఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు ఎన్టీఆర్ నీల్ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

ఇక ఈ ఈవెంట్ లో ప్రశాంత్ నీల్ నవ్వుతూ కనిపించకపోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. ఈ సినిమా గురించి అంతకుముందు మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను గుర్తుచేసి.. నీల్ కు ఈ ప్రాజెక్ట్ చేయడం ఇష్టం లేదని, ఎన్టీఆర్ బెదిరించి ఒప్పించినట్లు చెప్పుకొస్తున్నారు.


ఆ ఇంటర్వ్యూలో నవీన్ మాట్లాడుతూ.. “ఎన్టీఆరే మొదట ప్రశాంత్ నీల్ తో ఒక ప్రాజెక్ట్ చేయాలనీ చెప్పాడు. కెజిఎఫ్ అతనికి బాగా నచ్చింది. ఆయనే మాట్లాడమన్నారు. కథ ఉంటే నీల్ ను చెప్పమన్నారు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూ క్లిప్ ను సైతం నెట్టింట వైరల్ గా చేస్తూ ఎన్టీఆర్ పై ట్రోల్స్ గుప్పిస్తున్నారు.

నీల్ కు ఈ ప్రాజెక్ట్ చేయడం ఇష్టం లేదనుకుంటా.. అందుకే నవ్వడం లేదు. ఎన్టీఆర్ బెదిరించి ఈ సినిమా చేయిస్తున్నాడు అని, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే వీడియో మొత్తంలో నీల్ – ఎన్టీఆర్ కాంబో అదిరిపోయింది. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇవన్నీ కొంతమంది నెగెటివ్ చేయడానికే తప్ప.. అందులో నిజమే లేదని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ – నీల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×