Sai Dharam Tej.. మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ (Sai Dharam Tej) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం ఈయన ‘సంబరాలు ఏటి గట్టు’ అనే సినిమా చేస్తున్నారు. తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈయన.. ఇప్పుడు సక్సెస్ కోసం ఎంతో ఆరాటపడుతున్నారు కూడా.. ఒకప్పుడు ‘చిత్రలహరి’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘విరూపాక్ష’, ‘రిపబ్లిక్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల మెప్పించిన ఈయన . ఆ మధ్య ‘గంజా శంకర్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఒక వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని అప్పుడే అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎక్కడ టాక్ లేదు. ఇక దీంతో ఈ సినిమా ఉంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవ్వగా.. తాజాగా ఈ చిత్ర దర్శకుడు సంపత్ నంది స్పందించారు. ప్రస్తుతం తమన్నా (Tamannaah )ప్రధాన పాత్రలో ‘ఓదెల’, సీక్వెల్ గా ‘ఓదెల 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
Anchor Shiva Jyothi: శివజ్యోతి అరెస్ట్ అయ్యే వరకు వదిలేలా లేరుగా… పక్కా ఆధారాలతో ఫిర్యాదు..!
గంజా శంకర్ సినిమా అందుకే ఆపేశాం..
ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సంపత్ నంది మాట్లాడుతూ గంజా శంకర్ విడుదలపై క్లారిటీ ఇచ్చారు. సంపత్ నంది మాట్లాడుతూ.. ” నేను, సాయి ధరమ్ తేజ్ తో గంజా శంకర్ సినిమా మొదలు పెట్టాను. అయితే ఈ సినిమాను ప్రస్తుతం ఆపేశాము. ఈ సినిమాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నాకు, సాయిధరమ్ తేజ్ కు, నిర్మాతకు నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి మేము కథను బట్టి టైటిల్ పెట్టాము. కానీ టైటిల్ మార్చమని చెప్పారు. టైటిల్ మార్చితే అటు కథ కూడా పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. దానికంటే సినిమా ఆపేయడమే బెటర్ అని అనిపించి, ఇప్పుడు ఆపేసాము అంటూ తెలిపారు సంపత్ నంది.
నోటీసులు ఇవ్వడానికి కారణం అదే..
ఇకపోతే టైటిల్ పెట్టడంతోనే నోటీసులు ఇచ్చారా? అనే కోణంలో అభిమానులు సైతం ఆరా తీయగా.. అసలు విషయంలోకెళితే, ఈ మూవీకి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ సినిమాలో గంజాయి అనే పదాన్ని తొలగించాలని నోటీసులు ఇచ్చారు. సినిమాలో మాదకద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు వుంటే ఎన్డీపీఎస్-1985 చట్టం కింద చర్యలు తీసుకుంటామని కూడా వారు హెచ్చరించారట. ఇక ఈ చిత్రంలో గంజాయి మొక్కలను చూపించడమే కాకుండా వాటిని ప్రోత్సహించినట్లు సన్నివేశాలు ఉన్నాయని, అలాగే సినిమా టైటిల్ విద్యార్థులు, యువతపై ప్రభావం చూపుతుందని కూడా హెచ్చరించారు. ఇక మాదకద్రవ్యాల వినియోగాన్ని సాధారణంగా ఉన్నట్లు సినిమాలో సన్నివేశాలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని, అలాగే గంజాయి సన్నివేశాలు, డైలాగులు లేకుండా చూడాలని కూడా పోలీసులు నోటీసుల్లో తెలిపినట్లు సమాచారం. ఇక వీటన్నింటినీ మార్చడం కంటే సినిమాను ఆపేయడమే బెటర్ అని ఆలోచించారో ఏమో ఇప్పుడు సినిమాను ఆపేసామని సంపత్ నంది కూడా తెలిపారు.