CM Revanth – TANA Event: తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఆధ్వర్యంలో జులై 3 నుంచి 5 వరకు అమెరికా మిషిగాన్ రాష్ట్ర, నోవీ నగరంలో శుభర్బన్ కలెక్షన్ షోప్లేస్ వేదికగా 24వ తానా మహా సభలు జరగనున్నాయి.
అమెరికాలో 24వ తానా మహా సభలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ముఖ్య అతిధిగా ఆహ్వానించింది తానా సంఘం. అమెరికాలోని మిచిగాన్‌లో జులై 3 నుంచి జరగనున్న TANA మహా సభలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో తానా చైర్మన్ నాదెళ్ల గంగాధర్, మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి.. కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపాడి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తర అమెరికాలో తెలుగువాళ్లందరి కోసమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను సీఎంకు వివరించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహా సభలకు చీఫ్‌గెస్ట్‌గా హాజరుకావాలని కోరారు.
తానా సంస్థ ఉత్తర అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ నార్త్ అమెరికా తెలుగు సామాజిక, సాంస్కృతక, విద్యా రంగాల్లో విశేషంగా సేవలందిస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ తానా సభలు భారతీయ వర్గాల్లో అతిపెద్ద సదస్సులో ఒకటిగా నిలుస్తోంది.
Also Read: ఫ్యామిలీ ప్లానింగ్‌లో తెలంగాణే టాప్.. వామ్మో, అన్ని కండోమ్‌లు వాడేశారా!
తానా మహాసభలు జరుగుతున్నాయంటే.. ప్రపంచంలో ఉన్నటువంటి అందరి దృష్టి అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలు వైపై ఉంటుంది. తానా గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో తెలుగు సంస్కృతిని పరిరక్షించేందుకు కృషి చేస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఈ సభలకు ప్రపంచవ్యాప్తంగా ప్రవాసాంధ్రులు భారీగా హాజరవుతారు.
ఈ కార్య క్రమంలో సాంస్కృతిక, వ్యాపార, ఆధ్యాత్మిక, రాజకీయ, వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర వివిధ రంగాల్లో పేరు పొందిన ప్రముఖులు, కళాకారులు, రచయితలు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ఆధ్యాత్మిక నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొంటారు. ప్రతి సారి జరిగే తానా మహా సభల్లో సుమారు 10,000 మందికి పైగా తెలుగు ప్రజలు పాల్గొంటారు.